విశ్వాస ఘాతుకం అంటే ఇదే..!
చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ దంపతుల హత్యలో చింటూతో పాటు మరో కీలక పాత్రధారి టీడీపీ కార్పొరేటర్ మురుగా తీరు చూస్తే ఎంత విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. మేయర్ భర్త కటారి మోహన్‌కు మురుగా ఒకప్పుడు సన్నిహితుడే… 2014 స్థానిక ఎన్నికల్లో మురుగాకు రూ. 5లక్షలు మోహనే స్వయంగా ఖర్చులకోసం ఇచ్చారు. అంతేకాదు, మురుగా సతీమణికి మెదడు సంబంధమైన జబ్బు వస్తే వేలూరు సీఎంసీ హాస్పిటల్‌లో మోహనే స్వయంగా చికిత్సచేయించి అందుకయ్యే ఖర్చును […]
చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ దంపతుల హత్యలో చింటూతో పాటు మరో కీలక పాత్రధారి టీడీపీ కార్పొరేటర్ మురుగా తీరు చూస్తే ఎంత విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. మేయర్ భర్త కటారి మోహన్‌కు మురుగా ఒకప్పుడు సన్నిహితుడే… 2014 స్థానిక ఎన్నికల్లో మురుగాకు రూ. 5లక్షలు మోహనే స్వయంగా ఖర్చులకోసం ఇచ్చారు. అంతేకాదు, మురుగా సతీమణికి మెదడు సంబంధమైన జబ్బు వస్తే వేలూరు సీఎంసీ హాస్పిటల్‌లో మోహనే స్వయంగా చికిత్సచేయించి అందుకయ్యే ఖర్చును సొంతంగా భరించాడు. ఎన్నికలయ్యాక నగరంలో జరిగే కాంట్రాక్టు పనుల్లో తనకు ఆదాయం వచ్చే విధంగా కొన్నింటిని ఇవ్వాలని మురుగా అడిగితే మోహన్ నిరాకరించాడట. మొన్నే కదబ్బా… నీకు ఎన్నికల ఖర్చు ఇస్తిని… నీ భార్యకు వైద్యం చేయిస్తిని… నాకు నీలాంటి కార్పొరేటర్లు యాభై మంది ఉన్నారు. వారికి కూడా నేను ఏదన్నా చేయాలి కదా… ఏడాది వరకూ నువ్వేమీ పనులు అడగొద్దు. ఆ తరువాతే ఏదైనా నీకు చేసేది అని మోహన్ నిర్మొహమాటంగా చెప్పేశాడంట. అంతే… అప్పటి వరకూ మోహన్ తనకు చేసిన సాయం మురుగా మర్చిపోయి నేరుగా వెళ్లి చింటూతో చేతులు కలిపేశాడంటున్నారు… హన్నన్నా… ఇంత ఘాతుకమా… అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Click to Read: AP CS’s comment leave Government employees squirming