ఆమిర్ ఖాన్ భార్యది తెలంగాణే
ఆమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు పేరు ఇప్పుడు మారుమోగుతోంది. అసలు కిరణ్ రావు ఎవరు? ఆమె నేపథ్యం ఏంటని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. దీంతో కిరణ్ రావు గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిరణ్ రావుకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది. అమెది మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి. నిజాంకు సమాంతరంగా హిందూ రాజ్యాన్ని పరిపాలించిన వనపర్తి రాజ వంశీకుడు రాజా రామేశ్వర్‌రావు మనవరాలే కిరణ్‌రావు. రాజా రాజేశ్వర్‌రావు కుమారుడు కిరణ్ ఇంజనీరింగ్ […]
ఆమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు పేరు ఇప్పుడు మారుమోగుతోంది. అసలు కిరణ్ రావు ఎవరు? ఆమె నేపథ్యం ఏంటని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. దీంతో కిరణ్ రావు గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిరణ్ రావుకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉంది. అమెది మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి. నిజాంకు సమాంతరంగా హిందూ రాజ్యాన్ని పరిపాలించిన వనపర్తి రాజ వంశీకుడు రాజా రామేశ్వర్‌రావు మనవరాలే కిరణ్‌రావు.
రాజా రాజేశ్వర్‌రావు కుమారుడు కిరణ్ ఇంజనీరింగ్ చదివారు. ఉద్యోగ రీత్యా బెంగళూరు, కోల్‌కతా, ముంబైల్లో పనిచేశారు. దీంతో కూతురు కిరణ్ రావు చదువు కూడా కోల్‌కతా, ముంబైలలో సాగింది. కోల్‌కతాలోని లొరెటో హౌస్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన కిరణ్ ఎకనామిక్స్ డిగ్రీని ముంబైలోని సోఫియా కళాశాల నుంచి తీసుకొన్నారు. మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి పొందారు.
సినీరంగంపై ఉన్న ఆసక్తితో అశుతోష్ గోవర్కర్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరిన కిరణ్ రావు ఆమిర్ ఖాన్ నిర్మించిన లగాన్ సినిమాకు పనిచేశారు. ఆ సమయంలో ఆమిర్‌తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత వివాహానికి దారితీసింది. 2002లో ఆమిర్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కిరణ్ రావు పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాకుండా ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ అనే పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. వీరిద్దరికి ఆజాద్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం కిరణ్ రావ్ తల్లిదండ్రులు ఇద్దరూ బెంగళూరులోనే ఉంటున్నారు.
Click to Read: Intolerance statements boomerang on Shahrukh, Aamir