మళ్లీ సోషలిస్టు, సెక్యులర్ మాయం
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం గురువారం నాడు పత్రికలలో విడుదల చేసిన రాజ్యాంగ పీఠిక వ్యాపార ప్రకటనలో సోషలిస్టు, సెక్యులర్ అన్న మాటలు కనిపించలేదు. 2015లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మోదీ సర్కారు విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే పొరపాటు దొర్లింది. రాజ్యాంగం మూల ప్రతిలో ఈ మాటలు లేని మాట వాస్తవమే. 1976లో ఆమోదించిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో “సోషలిస్ట్”, “సెక్యులర్” అన్న మాటలు చేర్చారు. ఇప్పుడు […]
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం గురువారం నాడు పత్రికలలో విడుదల చేసిన రాజ్యాంగ పీఠిక వ్యాపార ప్రకటనలో సోషలిస్టు, సెక్యులర్ అన్న మాటలు కనిపించలేదు. 2015లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మోదీ సర్కారు విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే పొరపాటు దొర్లింది.
రాజ్యాంగం మూల ప్రతిలో ఈ మాటలు లేని మాట వాస్తవమే. 1976లో ఆమోదించిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో “సోషలిస్ట్”, “సెక్యులర్” అన్న మాటలు చేర్చారు. ఇప్పుడు అమలులో ఉన్నది సవరించిన ఈ రాజ్యాంగ పీఠికతో కూడిన రాజ్యాంగ ప్రతి మాత్రమే. ఆ రెండు మాటలు లేని రాజ్యాంగం కాదు. ఆ మాటలు లేని వ్యాపార ప్రకటన విడుదల చేయడం అపచారమే.
ఈ అంశంపై వివాదం చెలరేగగానే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఆదేశించారు. పొరపాటు ఎక్కడ, ఎందుకు, ఎలా జరిగిందో విచారించి నాలుగు రోజులలోగా నివేదించాలని సమాచార, ప్రసార విభాగాన్ని ఆదేశించారు. గత జనవరిలో మోదీ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనే విడుదల చేసినప్పుడు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు శకునం చెప్పే బల్లే కుడితిలో పడింది.