బెంగళూరులో రాహుల్ కు షాక్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెంగళూరు మహిళా కళాశాల విద్యార్థినులు షాకిచ్చారు. యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాహుల్.. మౌంట్ కార్మెట్ మహిళా కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు. మొదట ఎంతో ఉత్సాహంగా ప్రారంభించిన ముఖాముఖి కార్యక్రమం ప్రశ్నలు వేసే సమయంలో రాహుల్ చిక్కుల్లో పడ్డారు. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్ పథకాల అమలుపై అనూహ్య రీతిలో విద్యార్థినుల నుంచి రాహుల్ కు వ్యతిరేకంగా సమాధానాలు వచ్చాయి. దీంతో ఆయనలో అసహనం కనిపించింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం […]
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెంగళూరు మహిళా కళాశాల విద్యార్థినులు షాకిచ్చారు. యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాహుల్.. మౌంట్ కార్మెట్ మహిళా కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు. మొదట ఎంతో ఉత్సాహంగా ప్రారంభించిన ముఖాముఖి కార్యక్రమం ప్రశ్నలు వేసే సమయంలో రాహుల్ చిక్కుల్లో పడ్డారు. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్ పథకాల అమలుపై అనూహ్య రీతిలో విద్యార్థినుల నుంచి రాహుల్ కు వ్యతిరేకంగా సమాధానాలు వచ్చాయి. దీంతో ఆయనలో అసహనం కనిపించింది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం సక్రమంగా అమలవుతోందా? అన్న ప్రశ్నకు విద్యార్థుల నుంచి ఔను చాలా బాగా అమలవుతోందన్న సమధానం వచ్చింది. రాహుల్ మరోసారి స్వరం పెంచి స్వచ్ఛ భారత్ పనిచేస్తోందా? అని అడిగితే అంతే బిగ్గరగా విద్యార్థినులు కూడా ఔనన్న ఆన్సర్ ఇచ్చారు. దీంతో రాహుల్ నాకైతే అలా కనిపించటం లేదు. పోతేపోనీ మరో ప్రశ్న. మేక్ ఇన్ ఇండియా పని చేస్తోందా? అనడిగారు. దానికి కూడా విద్యార్థినులు ఔను… ఔను.. ఔను.. అన్నారు. మరి ఉద్యోగాలు దొరుకుతున్నాయని భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తే అవునన్న సమాధానమే వచ్చింది. నాకైతే ఉద్యోగాలు వస్తున్నట్లు కనిపించటం లేదంటూ రాహుల్ కాస్త అసహనంతో ముగించారు.
ముఖాముఖి అనంతరం బయట మాట్లాడిన రాహుల్ విద్యార్థినులతో ముఖాముఖి బాగా జరిగింది. సహనం, కలసి మెలసి జీవించటంపై మాట్లాడాం అని చెప్పడం విశేషం. భాజపా, సంఘ్ పరివార్ ఆలోచనలతో భారతీయుల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.