బ్రహ్మీకి పొగ బెడుతుందెవరు?
ఆహా నా పెళ్లంట! చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన గొప్ప నటుడు బ్రహ్మానందం. ఆయన గొప్ప నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో బ్రహ్మీ ఎంటరైతే చాలు ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి లేచి మరీ స్వాగతం పలుకుతారు. తెలుగువారికి ఆయనంటే అంత అభిమానం మరి! అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మ లాంటి వారే బ్రహ్మీ పాత్రలు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దేవారు. ఇక గత దశాబ్దకాలంగా యువదర్శకులు పూరీ జగన్నాథ్, త్రివిక్రం, వివి. వినాయక్, శ్రీను […]
BY sarvi24 Nov 2015 7:07 PM
X
sarvi Updated On: 25 Nov 2015 2:08 AM
ఆహా నా పెళ్లంట! చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన గొప్ప నటుడు బ్రహ్మానందం. ఆయన గొప్ప నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో బ్రహ్మీ ఎంటరైతే చాలు ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి లేచి మరీ స్వాగతం పలుకుతారు. తెలుగువారికి ఆయనంటే అంత అభిమానం మరి! అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మ లాంటి వారే బ్రహ్మీ పాత్రలు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దేవారు. ఇక గత దశాబ్దకాలంగా యువదర్శకులు పూరీ జగన్నాథ్, త్రివిక్రం, వివి. వినాయక్, శ్రీను వైట్లలు అయితే.. అసలు బ్రహ్మీ లేకుండా సినిమాలు చేయనేలేదంటే అతిశయోక్తి కాదు. వారితో అంతగా కనెక్టయ్యాడు బ్రహ్మీ. కొన్ని సందర్భాల్లో హీరో మెప్పించలేకపోయినా.. కేవలం బ్రహ్మానందం కామెడీ కారణంగా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. పైగా తన తోటి కమేడియన్లు ఎమ్మెస్ నారాయణ, కొండవలస, ఏవీఎస్, ఆహుతి ప్రసాద్, ధర్మవరం అకాలమరణం తరువాత బ్రహ్మీపై భారం మరింత పెరిగింది. మరి అలాంటి బ్రహ్మీకి ఇండస్ట్రీలో పొగబెట్టేలా కొత్త ప్రచారం ఒకటి తయారైంది. ఆయన దర్శకుల మాట లెక్కచేయరని, డైలాగులు వినరని, షాట్లు తీసుకోవడంలోనూ సహకరించడం లేదని ఫిలింనగర్‌లో ఓ రూమర్ నడుస్తోంది. దీనిపై స్పందించిన బ్రహ్మీ ఇలాంటివి ఎందుకు పుడుతుంటాయో తెలియదని సన్నిహితుల వద్ద వాపోయాడంట.
కొత్త వాళ్లే కారణమా?
తాజాగా బ్రహ్మీపై నడుస్తున్న రూమర్ ప్రకారం.. బ్రహ్మానందం కొత్త దర్శకుల మాట వినడం లేదు, రెమ్యునరేషన్ ఎక్కువ. ఓల్డ్ అయిపోయాడు.. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది కమెడియన్లు అందుబాటులోకి వచ్చారు. పృథ్విరాజ్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ), సప్తగిరి, తాగుబోతు రమేశ్, ఇంకా జబర్దస్త్ టీమ్ బ్రహ్మానందానికి పోటీగా తయారయ్యారు. పైగా వీరి రెమ్యునరేషన్ తక్కువ. చెప్పినట్లు వింటారు అన్న టాక్ బయల్దేరింది. ఈ రూమర్లతో బ్రహ్మానందం బాగా నొచ్చుకున్నారని తెలిసింది. తానెప్పుడూ దర్శకుడి పనిలో వేలు పెట్టలేదని, అసలు తనకు ఆలోచన లేదని వాపోతున్నాడట. అలాంటి వ్యక్తిత్వం ఉంటే తాను 1000 సినిమాలు ఎలా పూర్తి చేయగలుగుతాను అని తన మిత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడంట!
Next Story