Telugu Global
Others

వైఎస్‌ భుజంపై నుంచి బాక్సైట్‌కు బాబు గురి

తప్పును గత ప్రభుత్వాలపై నెట్టాలంటే చంద్రబాబు తొలుత తీసే అస్త్రం శ్వేత పత్రం. పరిస్థితిని వివరించే పేరుతో ఈ శ్వేతపత్రం ద్వారా అవతలి పక్షాన్ని ఇరుకునపెడుతుంటారు చంద్రబాబు. ఇప్పుడు బాక్సైట్ విషయంలోనూ అదే పేపర్ అస్త్రాన్ని బాబు ప్రయోగించారు. మంగళవారం శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు బాక్సైట్ ఒప్పందాలన్నీ వైఎస్‌ హయాంలోనే జరిగాయని.. కావాల్సిన వ్యక్తులకు బాక్సైట్‌ను కట్టబెట్టే ఉద్దేశంతోనే ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలను విన్న వారు బాక్సైట్‌ ఒప్పందాలపై రద్దు ప్రకటన చేస్తారని […]

వైఎస్‌ భుజంపై నుంచి బాక్సైట్‌కు బాబు గురి
X

తప్పును గత ప్రభుత్వాలపై నెట్టాలంటే చంద్రబాబు తొలుత తీసే అస్త్రం శ్వేత పత్రం. పరిస్థితిని వివరించే పేరుతో ఈ శ్వేతపత్రం ద్వారా అవతలి పక్షాన్ని ఇరుకునపెడుతుంటారు చంద్రబాబు. ఇప్పుడు బాక్సైట్ విషయంలోనూ అదే పేపర్ అస్త్రాన్ని బాబు ప్రయోగించారు. మంగళవారం శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు బాక్సైట్ ఒప్పందాలన్నీ వైఎస్‌ హయాంలోనే జరిగాయని.. కావాల్సిన వ్యక్తులకు బాక్సైట్‌ను కట్టబెట్టే ఉద్దేశంతోనే ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలను విన్న వారు బాక్సైట్‌ ఒప్పందాలపై రద్దు ప్రకటన చేస్తారని భావించారు. కానీ అలా జరగలేదు.

బాక్సైట్‌ ఒప్పందాలన్నింటికి కారణం వైఎస్సే అన్న చంద్రబాబు వాటిని రద్దు చేస్తున్నట్టు మాత్రం ప్రకటించలేదు. పైగా బాక్సైట్ తవ్వకాల వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో బాక్సైట్ ఉండగా మన రాష్ట్రంలో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. అంటే పరోక్షంగా పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన వెనుకబడ్డాం అన్న అభిప్రాయాన్ని కలిగించారు. అంతేకాదు బాక్సైట్ తవ్వకాల వల్ల ప్రతి ఏటా ఒడిషా రాష్ట్రానికి 5వేల 300 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. తద్వారా బాక్సైట్ తవ్వకాల వల్ల భారీగా ఆదాయం వస్తుందని… కాబట్టి అందరూ సహకరించాలని చంద్రబాబు పరోక్షంగా కోరారు. నిజంగా చంద్రబాబుచెబుతున్నట్టు వైఎస్ హయాంలో తప్పుడు ఒప్పందాలు జరిగి ఉంటే వాటిని ఇప్పుడు ఎందుకు రద్దు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వైఎస్‌ ప్రభుత్వ ఒప్పందాలను పదేపదే తప్పుపట్టేబదులు వాటిని రద్దు చేయవచ్చు కదా అన్నది పలువురి ప్రశ్న. గిరిజనుల మీద చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని సూటిగా ఎందుకు చెప్పడం లేదన్నది మరో ప్రశ్న. కేవలం వైఎస్‌ కుటుంబంపై నెపాన్ని నెట్టేసి పనిచేసుకుపోవాలన్న భావన ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ భుజం మీదుగా బాక్సైట్‌పై చంద్రబాబు గురి పెడుతున్నట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Click to Read: Great Going for Dil Raju

First Published:  25 Nov 2015 5:56 AM IST
Next Story