Telugu Global
Cinema & Entertainment

నటి మీనా కూతురు నైనిక వెండితెరకు

బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటి మీనా కూతురు నైనిక వెండితెరకు పరిచయం కాబోతోంది. విజయ్ హీరోగా తెరకెక్కున్న ఓ కోలీవుడ్ మూవీలో మీనా ముద్దుల చిన్నారి  తెరంగేట్రం చేయనుంది. మరోవైపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత ఈ సినిమాలో మరోసారి తల్లిపాత్రలో కనిపించబోతోంది. మొదటి సారి మనం సినిమాలో తల్లిపాత్రలో అలరించిన సమంత  ఈ సారి మరో […]

నటి మీనా కూతురు నైనిక వెండితెరకు
X

బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటి మీనా కూతురు నైనిక వెండితెరకు పరిచయం కాబోతోంది. విజయ్ హీరోగా తెరకెక్కున్న ఓ కోలీవుడ్ మూవీలో మీనా ముద్దుల చిన్నారి తెరంగేట్రం చేయనుంది. మరోవైపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత ఈ సినిమాలో మరోసారి తల్లిపాత్రలో కనిపించబోతోంది. మొదటి సారి మనం సినిమాలో తల్లిపాత్రలో అలరించిన సమంత ఈ సారి మరో హీరోయిన్ కూతురికి తల్లిగా నటించోతోంది.

అయితే హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న సమయంలో తల్లిపాత్ర ద్వారా సాహసం చేసిన సామ్స్ తర్వాత మళ్ళీ వెండితెరపై తల్లి పాత్రను చేయకూడదనుకొన్నదట. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ తల్లి పాత్రలో కోలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నది. విజయ్ హీరోగా రాజా రాణి దర్శకుడు అట్లీ … కలిపులి ధాను నిర్మాతగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తున్నది. కాగా ఈ సినిమాలో సమంత ఓ కూతురికి తల్లిగా నటించబోతోంది. ఈ కూతురు పాత్రలోనే నైనిక కనిపింబచోతోంది. దీంతో బాలనటిగా నైనిక మురిపిస్తుందా…తల్లి మీనాను మరిపిస్తుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయట

First Published:  25 Nov 2015 7:08 AM GMT
Next Story