Telugu Global
Cinema & Entertainment

మీడియా పై మ‌రోసారి సిద్ధార్ద మండిపాటు

హీరో సిద్దార్దం నేషనల్ మీడియాపై విరుచుకు పడ్డారు. తమ తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాల్లో వరదలు ప్రజలను ముంచెత్తుతుంటే.. జాతీయ మీడియా ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని సినీ నటుడు సిద్ధార్థ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నను స్పందించారు. ఆయనేం ట్వీట్ చేసారో చూడండి. చెన్నైలోని వరద బీభత్సాన్ని పట్టించుకోకుండా.. ఆమీర్‌ ఖాన్‌, షీనా బోరాలకు సంబంధించిన అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు. సిద్ధార్థ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా […]

మీడియా పై మ‌రోసారి సిద్ధార్ద మండిపాటు
X

హీరో సిద్దార్దం నేషనల్ మీడియాపై విరుచుకు పడ్డారు. తమ తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాల్లో వరదలు ప్రజలను ముంచెత్తుతుంటే.. జాతీయ మీడియా ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని సినీ నటుడు సిద్ధార్థ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నను స్పందించారు. ఆయనేం ట్వీట్ చేసారో చూడండి. చెన్నైలోని వరద బీభత్సాన్ని పట్టించుకోకుండా.. ఆమీర్‌ ఖాన్‌, షీనా బోరాలకు సంబంధించిన అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయంటూ ఆయన ఆరోపించారు.

సిద్ధార్థ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ వ్యాఖ్యలు చేస్తూ.. మా గురించి కూడా మాట్లాడండి అంటూ జాతీయ మీడియాకి విజ్ఞప్తి చేశారు. ‘బాయ్స్‌’ ద్వారా తెలుగు,తమిళ ప్రేక్షకులను పలకరించిన నటుడు సిద్ధార్థ్‌. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా వంటి చిత్రాలతో … తెలుగువారికి నచ్చిన హీరోగా పేరు సొంతం చేసుకున్నాడు. కానీ కొంత కాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స లేవు. ఇప్పుడు తన దృష్టిని తమిళతెరపై పెట్టాడు. ‘పిజ్జా’ దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ నిర్దేశకత్వంలో ‘జిగర్‌దండా’లో నటించాడు. సిద్ధార్థ్‌ చిత్రాల విషయానికి వస్తే…సిద్దార్ద హీరోగా తమిళంలో రూపొందిన జిగరతాండ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

First Published:  25 Nov 2015 12:34 AM IST
Next Story