మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడి దుర్మారణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ పేర్వారం రాములు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాములు మనవడు వరుణ్ పవార్ చనిపోయారు. వరుణ్ పవార్ ప్రయాణిస్తున్న స్కోడా కారు… పాల వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో వరుణ్‌తోపాటు మరో నలుగురు ఉన్నారు. వీరంతా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న వరుణ్‌తో పాటు […]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ పేర్వారం రాములు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాములు మనవడు వరుణ్ పవార్ చనిపోయారు. వరుణ్ పవార్ ప్రయాణిస్తున్న స్కోడా కారు… పాల వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో వరుణ్‌తోపాటు మరో నలుగురు ఉన్నారు. వీరంతా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న వరుణ్‌తో పాటు జ్ఞానదేవ్, పవన్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను వరుణ్ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Click to Read: Hattrick hero after Udayakiran