ఎఫైర్ మరో ఫైర్..!
ఈ నెలాఖరున విడుదల కానున్న ‘ఎఫైర్ ‘ సినిమాపై అప్పుడే రచ్చ మొదలైంది. ఈ సినిమా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ అనే అంశంతో రూపొందించడమే ఇందుకు కారణం. శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో భీమవరం టాకీస్ పతాకంపై శ్రీ రాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఎఫైర్’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమ అనే అంశం ఉన్నప్పటికీ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడం విశేషం. నిజంగానే […]
ఈ నెలాఖరున విడుదల కానున్న ‘ఎఫైర్ ‘ సినిమాపై అప్పుడే రచ్చ మొదలైంది. ఈ సినిమా ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ అనే అంశంతో రూపొందించడమే ఇందుకు కారణం. శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో భీమవరం టాకీస్ పతాకంపై శ్రీ రాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఎఫైర్’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమ అనే అంశం ఉన్నప్పటికీ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడం విశేషం. నిజంగానే అలాంటి కథాంశంతో సినిమా తీశారా? లేదా? అన్నది విడుదలకు ముందే చెప్పలేం. కానీ, ఈ సినిమా 18 ఏళ్ల క్రితం విడుదలై వివాదాస్పదంగా మారిన ఫైర్ చిత్రాన్ని గుర్తుకు తెస్తోంది. అలాంటి సన్నివేశాలు ఇందులోనూ ఉంటే.. సినిమా ఆడటం డౌటేనంటున్నారు సినీ విశ్లేషకులు.
ఫైర్‌లో ఏముంది?
దీపా మెహతా ‘ఫైర్’అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 1998లో విడుదలైన ఈ సినిమా భారతదేశంలో రాజేసిన మంటల సెగలు అందరికీ తెలిసినవే! ఇద్దరు లెస్బియన్లు (ఆడ వారి స్వలింగ సంపర్కం) అంశం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద దుమారమే రేపింది. ఆ సినిమాలో జాతీయ ఉత్తమ నటులుగా పురస్కారాలు అందుకున్న షబానా ఆజ్మీ, నందితాదాస్‌లు భర్తల నిరాదరణకు గురైన మహిళలుగా నటించారు. మహిళా సంఘాలు, ఆధ్మాత్మిక సంఘాలు సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని పలు చోట్ల నిరసనలు, ధర్నాలు జరిగాయి. సనాతన సంప్రదాయంతో వర్ధిల్లుతోన్న భారత్‌లో ఇలాంటి పాశ్యాత్చ పోకడలు ఇక్కడి మహిళలను, యువతను పెడదోవ పట్టిస్తాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘ స్వలింగ సంపర్కం నేరమని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది’. ఈ నేపథ్యంలో ఎఫైర్‌కు ఎలాంటి ఆటంకాలు వస్తాయో చూడాలి!