Telugu Global
Others

వరంగల్ ఉప ఎన్నిక కౌంటింగ్

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.  బరిలో మొత్తంలో 23 మంది అభ్యర్థులున్నారు.  22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. టీఆర్‌ఎస్ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, బీజేపీ నుంచి దేవయ్య బరిలో ఉన్నారు. టీఆర్ఎస్  4,59,092 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. TRS                   615403 Cong                 155957 BJP/TDP       […]

వరంగల్ ఉప ఎన్నిక కౌంటింగ్
X

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. బరిలో మొత్తంలో 23 మంది అభ్యర్థులున్నారు. 22 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. టీఆర్‌ఎస్ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, బీజేపీ నుంచి దేవయ్య బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

TRS 615403
Cong 155957
BJP/TDP 130043
YSRCP 23844
OTHRS 100946

13:10 PM – టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 4,53,443 పైచిలుకు ఓట్ల ఆధిక్యత సాధించారు.

12:30 PM – టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ 3,52,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యత సాధించారు.

12.00PM – 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్ ఆధిక్యం 3 లక్షల 3 వేల 498 ఓట్లు.

11.30 AM- భారీ ఆధిక్యం దిశగా టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి . మూడు లక్షలు దాటిన మేజారిటీ.

10.30 AM- 2లక్షల 56 వేల ఓట్ల ఆథిక్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి.

10. 10 AM– రెండు లక్షల 28 వేలు టీఆర్‌ఎస్ ఆధిక్యం.

9.50AM- లక్షా 23 వేల ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌. కొనసాగుతున్న ఐదో రౌండ్ కౌంటింగ్.

9.30 AM- లక్ష దాటిన టీఆర్‌ఎస్ మేజారిటీ. ఏకపక్షంగా ఫలితాలు. గ్రామాలు, పట్టణాలు అన్ని చోట్ల గులాబీ గుబాలింపు. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ.

9. 20 AM- దూసుకెళ్తున్న కారు. 61వేలు దాటిన టీఆర్‌ఎస్ ఆధిక్యం.

9.10 AM- తొలిరౌండ్ కౌంటింగ్ పూర్తి. 51,985 ఓట్ల ఆధిక్యం టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లభించినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. రెండో రౌండ్‌లోనూ కారుదే పైచేయి.

8.50AM- భారీ ఆధిక్యం దిశగా టీఆర్‌ఎస్‌, తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్న మిగిలిన పార్టీలు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ అధిక్యం 25, 090 ఓట్లు.

8. 40 AM- తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏడు వేల ఓట్ల అధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో 1600,పరకాలలో 900 ఓట్ల ఆధిక్యం ఉంది. వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏకంగా 4వేల ఓట్ల అధిక్యం టీఆర్‌ఎస్‌కు ఉంది.

8.30 AM- తొలిరౌండ్‌ కౌంటింగ్ జరుగుతోంది. టీఆర్‌ఎస్ అధిక్యంలో కొనసాగుతోంది. పాలకుర్తి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్ అధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ అధికార పార్టీదే పైచేయిగా ఉంది.

8. 15 am- మొత్తం నాలుగు పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు పోలవగా… నాలుగూ ఓట్లు కూడా కాంగ్రెస్ సొంతం చేసుకుంది.

First Published:  24 Nov 2015 3:02 AM IST
Next Story