మహేష్ కు చిర్రెత్తించారు..!
ఒక సినిమా నిర్మాణంలో వుండగా దాని గురించిన నెగెటివ్ ప్రచారం ఎవరికైనా చిర్రెత్తిస్తుంది. ఆ చిత్ర కథానాయకుడే కాకుండా నిర్మాతల్లో ఒకడు కూడా అయితే సదరు ప్రచారం ఆ హీరోని ఇంకాస్త ఇబ్బంది పెడుతుంది. బ్రహ్మోత్సవం చిత్రంపై ఒక చిత్రమైన పుకారుని మీడియాలోని ఒక వర్గం పుట్టించింది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథ రాసుకోలేదని, కేవలం ఒక లైన్ రాసుకుని సెట్స్ మీదకి వెళ్లిపోయాడని రూమర్ పుట్టుకొచ్చింది. అడ్డాలకి ఏం తీస్తున్నాడనే దానిపై క్లారిటీ […]
ఒక సినిమా నిర్మాణంలో వుండగా దాని గురించిన నెగెటివ్ ప్రచారం ఎవరికైనా చిర్రెత్తిస్తుంది. ఆ చిత్ర కథానాయకుడే కాకుండా నిర్మాతల్లో ఒకడు కూడా అయితే సదరు ప్రచారం ఆ హీరోని ఇంకాస్త ఇబ్బంది పెడుతుంది. బ్రహ్మోత్సవం చిత్రంపై ఒక చిత్రమైన పుకారుని మీడియాలోని ఒక వర్గం పుట్టించింది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథ రాసుకోలేదని, కేవలం ఒక లైన్ రాసుకుని సెట్స్ మీదకి వెళ్లిపోయాడని రూమర్ పుట్టుకొచ్చింది. అడ్డాలకి ఏం తీస్తున్నాడనే దానిపై క్లారిటీ లేకపోవడం మహేష్‌కి కోపం తెప్పిస్తోందని, శ్రీమంతుడు తర్వాత మరో ఘన విజయంతో టాప్ పొజిషన్ పక్కా చేసుకోవాలని చూస్తోన్న టైమ్‌లో అడ్డాల ఇలా చేయడం నచ్చడం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ రూమర్స్‌ని మహేష్ లైట్ తీసుకోలేదు. ఇలాంటి పుకార్లు సినిమాపై నెగెటివ్ ఇంప్రెషన్ వేయడమే కాకుండా బిజినెస్‌ని కూడా ప్రభావితం చేస్తాయి కనుక మహేష్ దీనిపై చాలా సీరియస్ అయ్యాడట. ఇలాంటి పుకార్లు పుట్టించేదెవరు… ఎందుకొస్తున్నాయంటూ సెట్లో మండి పడ్డాడట.
దాంతో పీఆర్ టీమ్ వెంటనే అలర్ట్ అయి బ్రహ్మోత్సవం షూటింగ్ బ్రహ్మాండంగా జరుగుతోందనే విషయం మీడియాకి నోట్ పంపించారు. ఊటీలో డిసెంబర్‌లో ఇరవై రోజుల పాటు తారాగణమంతటిపై షెడ్యూల్ వుంటుందనే సంగతి తెలియజేయడం ద్వారా ఎంత క్లారిటీతో షూటింగ్ జరుగుతోందనే సంగతిని కూడా చెప్పకనే చెప్పారు. నిర్మాణంలో వున్న సినిమాలపై ఇలాంటి బేస్‌లెస్ రూమర్స్ పుట్టించే వాళ్లు కాస్త ఆ తీటని తమకే పరిమితం చేసుకోవాలి. కోట్లతో కూడుకున్న వ్యాపారంపై సరదా కొద్దీ లేదా దురద కొద్దీ పుట్టించే పుకార్లు పుట్టించే నష్టం అంతా ఇంతా కాదని తెలుసుకోవాలి.