టీడీపీపై నింద, మోదీపై అసంతృప్తి: నోరువిప్పిన బీజేపీ అభ్యర్థి
వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ సగం కూడా పూర్తి కాకముందే బీజేపీ- టీడీపీ కూటమి అభ్యర్థి దేవయ్య ఓటమిని అంగీకరించేశారు. ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. అంతేకాదు మోదీ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రమంత్రి పదవి ఇస్తానని మోదీ బహిరంగంగా చెప్పి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. మోదీ అలా ప్రకటన చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దేవయ్య వాపోయారు. ఓడిపోయినందుకు తనకేమి బాధలేదన్నారు. ఏడో తరగతి పెయిల్ […]

వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ సగం కూడా పూర్తి కాకముందే బీజేపీ- టీడీపీ కూటమి అభ్యర్థి దేవయ్య ఓటమిని అంగీకరించేశారు. ఎన్నికల్లో టీడీపీ ఏమాత్రం సహకరించలేదని చెప్పారు. అంతేకాదు మోదీ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రమంత్రి పదవి ఇస్తానని మోదీ బహిరంగంగా చెప్పి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. మోదీ అలా ప్రకటన చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దేవయ్య వాపోయారు.
ఓడిపోయినందుకు తనకేమి బాధలేదన్నారు. ఏడో తరగతి పెయిల్ అయిన వ్యక్తి చేతిలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ఓడిపోయారని అలాంటప్పుడు తానెంత అని దేవయ్య వ్యాఖ్యానించారు.