Telugu Global
Others

అమాయ‌కుల‌ను హ‌త‌మార్చేవాడు ముస్లిం కాబోడు " అమీర్‌ఖాన్‌

మ‌తం పేరుతో టెర్ర‌రిస్టులు సృష్టిస్తున్న మార‌ణ‌హోమం త‌న‌కు తీవ్ర‌మైన ఆందోళ‌న‌ని క‌లిగిస్తోంద‌ని ప్ర‌ముఖ బాలివుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ అన్నారు. ఇస్లాం పేరు చెప్పి అమాయ‌కుల‌ను ఊచ‌కోత కోయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. పారిస్‌లో ఐఎస్ ఉగ్ర‌వాదుల విద్వంస‌చ‌ర్య‌ల‌పై అమీర్‌, రామ్‌నాథ్ గొయెంకా ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్య‌క్ర‌మంలో స్పందించారు. ఒక ప‌క్క ఖురాన్‌ని అనుస‌రిస్తున్నామంటూ, మ‌రో ప‌క్క సాటి మ‌నుషుల‌ను చంప‌డం అమానుష‌మ‌ని, అది ఎన్న‌టికీ ఇస్లామిక్ చ‌ర్య‌ కాబోద‌ని ఆయ‌న అన్నారు. అమాయ‌కుల‌ను హ‌త‌మార్చేవాడు ఎప్ప‌టికీ ముస్లిం […]

అమాయ‌కుల‌ను హ‌త‌మార్చేవాడు ముస్లిం కాబోడు  అమీర్‌ఖాన్‌
X

మ‌తం పేరుతో టెర్ర‌రిస్టులు సృష్టిస్తున్న మార‌ణ‌హోమం త‌న‌కు తీవ్ర‌మైన ఆందోళ‌న‌ని క‌లిగిస్తోంద‌ని ప్ర‌ముఖ బాలివుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ అన్నారు. ఇస్లాం పేరు చెప్పి అమాయ‌కుల‌ను ఊచ‌కోత కోయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. పారిస్‌లో ఐఎస్ ఉగ్ర‌వాదుల విద్వంస‌చ‌ర్య‌ల‌పై అమీర్‌, రామ్‌నాథ్ గొయెంకా ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్య‌క్ర‌మంలో స్పందించారు. ఒక ప‌క్క ఖురాన్‌ని అనుస‌రిస్తున్నామంటూ, మ‌రో ప‌క్క సాటి మ‌నుషుల‌ను చంప‌డం అమానుష‌మ‌ని, అది ఎన్న‌టికీ ఇస్లామిక్ చ‌ర్య‌ కాబోద‌ని ఆయ‌న అన్నారు. అమాయ‌కుల‌ను హ‌త‌మార్చేవాడు ఎప్ప‌టికీ ముస్లిం కాబోడ‌ని, ఒక‌వేళ అత‌నలా చెప్పుకున్నా అత‌నికి ముస్లింగా గుర్తింపు ద‌క్క‌ద‌ని, అత‌ను టెర్ర‌రిస్ట్ క‌నుక టెర్ర‌రిస్ట్‌గానే గుర్తింపుని పొందుతాడ‌ని అమీర్ అన్నారు. తాను ఐఎస్ గురించే కాక అలాంటి ఆలోచ‌నా ధోర‌ణిప‌ట్ల ఆందోళ‌న చెందుతున్నాన‌న్నారు. ఇది చాలా తీవ్ర‌మైన‌, ప్ర‌మాద‌క‌ర‌మైన ఆలోచ‌నా స‌ర‌ళి అని పేర్కొన్నారు.

ఈ రోజు ఐఎస్‌, రేపు మ‌రొక తీవ్ర‌వాద సంస్థ‌…వీళ్లంతా ఈ ర‌క‌మైన తీవ్ర‌భావ‌జాలాన్ని పెంచి పోషించ‌డం త‌న‌ని ఎంత‌గానో క‌ల‌చివేస్తోంద‌న్నారు. మ‌తంతో సంబంధం లేకుండా ఇలాంటి ఆలోచ‌నా ధోర‌ణిని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టుగా అమీర్ ఖాన్ తెలిపారు.

First Published:  24 Nov 2015 5:49 AM IST
Next Story