చిత్తూరు కొత్త మేయర్ ఎవరు?
చిత్తూరు మేయర్ అనురాధ హత్య నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. చిత్తూరు మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఆస్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు?.. చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారన్నదానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన కటారిమోహన్ ఓసీ అయినప్పటికీ ఆయన భార్య అనురాధ( ఈడిగ, తండ్రి వైపు నుంచి) బీసీ కావడంతో ఆమెకు అప్పట్లో మేయర్ స్థానం దక్కింది. ఇప్పుడు ఆమె చనిపోవడంతో మరో బీసీ మహిళకు […]
చిత్తూరు మేయర్ అనురాధ హత్య నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. చిత్తూరు మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఆస్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు?.. చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారన్నదానిపై టీడీపీలో చర్చ జరుగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన కటారిమోహన్ ఓసీ అయినప్పటికీ ఆయన భార్య అనురాధ( ఈడిగ, తండ్రి వైపు నుంచి) బీసీ కావడంతో ఆమెకు అప్పట్లో మేయర్ స్థానం దక్కింది. ఇప్పుడు ఆమె చనిపోవడంతో మరో బీసీ మహిళకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
మేయర్ పదవిని అనురాధ కుటుంబసభ్యులకే కేటాయించాలని చంద్రబాబు ఇప్పటికే ఒకనిర్ణయానికి వచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. అనురాధ కోడలు హేమలత కూడా బీసీ సామాజికవర్గానికి( ఆమె తండ్రి వైపు నుంచి) చెందిన వారే.కాబట్టి ఆమెకే మేయర్ పదవి దక్కవచ్చని నేతలు చెబుతున్నారు. అనురాధ స్థానంలో కార్పొరేటర్‌గా హేమలతను గెలిపించి అనంతరం మేయర్ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే హేమలత వివాహం అనంతరం ఓసీ అయిన కటారి ఇంటికి కోడలుగా వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్లపరంగా గానీ, మరే ఇతర ఇబ్బందులు ఎదురైన పక్షంలో హేమలత కాకుండా పార్టీకి విధేయులుగా ఉండే మహిళ కార్పొరేటర్లకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. కటారి కుమార్తె పేరు కూడా రేసులో వినిపిస్తోంది.
ప్రస్తుతం చిత్తూరులో ఎనిమిది మంది బీసీ మహిళా కార్పొరేటర్లు ఉన్నారు.కటారి ఫ్యామిలీ రేసులో లేని పక్షంలో తమకు అవకాశం కల్పించాలని పలువురు మహిళ కార్పొరేటర్లు కోరుతున్నారు. ఏది ఏమైనా కొత్త మేయర్ ఎంపికలో అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమని నేతలు చెబుతున్నారు.