ఐఎస్‌ఐఎస్‌లో బానిసల్లా భారతీయ ఫైటర్లు ?
వివక్ష విశ్వవ్యాప్తమైనట్టుగా కనిపిస్తోంది. చివరకు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లోనూ ఈ వివక్ష విజృంభిస్తోంది. ఐఎస్‌ఐఎస్‌లో చేరిన భారతీయులతో పాటు ఇతర దక్షిణాసియా దేశాల ఫైటర్లను దారుణంగా ట్రీట్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. విదేశీ నిఘా సంస్థల తయారు చేసిన నివేదికలు భారత్ ప్రభుత్వానికీ చేరాయి. అందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, సూడాన్, నైజీరియా నుంచి వెళ్లిన ఫైటర్లకు తక్కువ జీతం, తక్కువ కేడర్ ఇచ్చి అవమానిస్తున్నారు. అరబ్ దేశాలకు చెందిన వారికి […]
వివక్ష విశ్వవ్యాప్తమైనట్టుగా కనిపిస్తోంది. చివరకు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లోనూ ఈ వివక్ష విజృంభిస్తోంది. ఐఎస్‌ఐఎస్‌లో చేరిన భారతీయులతో పాటు ఇతర దక్షిణాసియా దేశాల ఫైటర్లను దారుణంగా ట్రీట్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. విదేశీ నిఘా సంస్థల తయారు చేసిన నివేదికలు భారత్ ప్రభుత్వానికీ చేరాయి. అందులో పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, సూడాన్, నైజీరియా నుంచి వెళ్లిన ఫైటర్లకు తక్కువ జీతం, తక్కువ కేడర్ ఇచ్చి అవమానిస్తున్నారు.
అరబ్ దేశాలకు చెందిన వారికి మాత్రం ఆఫీసర్ హోదాతో పాటు భారీగా జీతాలు చెల్లిస్తున్నారు. దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని గుంపులు గుంపులుగా ఇరుకు బ్యారక్‌లలో ఉంచుతున్నారు. దక్షిణాసియా నుంచి వెళ్లిన వారికి పోరాడే సామర్త్యం తక్కువంటూ ఇలా వివక్ష చూపుతున్నారు. మానవబాంబులుగా మాత్రం దక్షిణాసియా దేశాల నుంచి వెళ్లిన వారినే వాడుతున్నారు. వాహనాల్లో పేలుడు పదార్దాలు నింపి టార్గెట్ చేధనకు పంపుతున్నారు. ప్రత్యర్థులు దాడులకు దిగిన సమయంలోనూ ముందు వరుసలో ఇండియా, బంగ్లా, పాక్ నుంచి వెళ్లిన వారినే ఉంచుతున్నారు. అందుకే ఐఎస్‌ఐఎస్‌లో చనిపోతున్న, గాయపడుతున్న వారిలో ఇటు వైపు నుంచి వెళ్లిన వారే అధికంగా ఉన్నారు.
భారత్ నుంచి 23 మంది ఐఎస్‌ఐఎస్‌లోకి వెళ్లగా వారిలో ఆరుగురు ఇప్పటికే చనిపోయారు. అలాచనిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వసీమ్ మహ్మద్ అనే యువకుడు కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు తమ నివేదికలో వెల్లడించాయి. మొత్తం మీద భారత్, బంగ్లా, పాక్, నైజీరియా తదితర దేశాల నుంచి వెళ్లిన వారిని ఐఎస్‌ఐఎస్‌లో బానిసల్లాగా ట్రీట్ చేస్తున్నారని నిఘా వర్గాల నివేదిక సారాంశంగా ఉంది.