Telugu Global
NEWS

ఎలా కాల్చాలో పోలీసులకు తెలుసు: హైకోర్టు

ఇటీవల హైదరాబాద్‌లో గొలుసు దొంగలపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు కాల్పులు జరిపారని, ఈ విధంగా మరోసారి కాల్పులు జరపకుండా ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి  హైకోర్టులో పిల్ వేశారు. అయితే పిటిషన్ గొలుసు దొంగలపై సానుభూతి చూపుతున్నట్టుగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. గొలుసు దొంగలు ఏం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఊరుకోవాలా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. […]

ఎలా కాల్చాలో పోలీసులకు తెలుసు: హైకోర్టు
X

ఇటీవల హైదరాబాద్‌లో గొలుసు దొంగలపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు కాల్పులు జరిపారని, ఈ విధంగా మరోసారి కాల్పులు జరపకుండా ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. అయితే పిటిషన్ గొలుసు దొంగలపై సానుభూతి చూపుతున్నట్టుగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. గొలుసు దొంగలు ఏం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఊరుకోవాలా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

”పోలీసులకు కాల్పులు ఎలా జరపాలో తెలుసు. భద్రతా చర్యల గురించి వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.. గొలుసు దొంగలు ఏం చేస్తున్నా పట్టించుకోవద్దా? వారి అరాచకాలు పెరిగిపోతున్నా చూస్తూ ఉండాలా? అని పిటిషనర్‌ను నిలదీసింది. వ్యాజ్యాన్ని కొట్టేస్తామని స్పష్టం చేసింది. అయితే పిటిషన్ వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకుంటానని కోరగా… అందుకు ధర్మాసనం అంగీకరించింది.

First Published:  23 Nov 2015 5:55 PM IST
Next Story