Telugu Global
Others

హత్యలో కార్పొరేటర్ల హస్తం.. బురఖాలు కొనింది వారే!

చిత్తూరు మేయర్ అనురాధ హత్యకేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్ది కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యలకు ఇద్దరు కార్పొరేటర్లు కావాల్సినంత సాయం చేశారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కార్పొరేటర్ల సాయం లేకుంటే దుండగులు ఏకంగా మేయర్ చాంబర్ వరకు వెళ్లే వారు కాదని చెబుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు కూడా కార్పొరేటర్లు చేసిన సాయాన్ని బయటపెట్టారు. ఇద్దరు ప్రస్తుత‌ కార్పొరేటర్లు తోపాటు మాజీ కార్పొరేటర్లు ప్రత్యక్షంగా హత్యలకు సాయం అందించారు. కార్పొరేషన్ పరిధిలో టెండర్లు.. […]

హత్యలో కార్పొరేటర్ల హస్తం.. బురఖాలు కొనింది వారే!
X

చిత్తూరు మేయర్ అనురాధ హత్యకేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్ది కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యలకు ఇద్దరు కార్పొరేటర్లు కావాల్సినంత సాయం చేశారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కార్పొరేటర్ల సాయం లేకుంటే దుండగులు ఏకంగా మేయర్ చాంబర్ వరకు వెళ్లే వారు కాదని చెబుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు కూడా కార్పొరేటర్లు చేసిన సాయాన్ని బయటపెట్టారు.

ఇద్దరు ప్రస్తుత‌ కార్పొరేటర్లు తోపాటు మాజీ కార్పొరేటర్లు ప్రత్యక్షంగా హత్యలకు సాయం అందించారు. కార్పొరేషన్ పరిధిలో టెండర్లు.. పనులు.. సంక్షేమ పథకాలల్లో మేయర్ దంపతుల నుంచి సదరు కార్పొరేటర్లకు మొండి చేయి ఎదురైనట్టు తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న వారు చింటూ వద్ద పదేపదే ఈ విషయాలు చెప్పి వాపోయారని గుర్తించారు. కార్పొరేటర్ల అసంతృప్తిని చింటూ తనకు అనుకూలంగా వాడుకుని హత్యలకు వారి సాయం తీసుకున్నాడు.

హంతకులకు ఒక కార్పొరేటరే స్వయంగా బురఖాలు కొని తెచ్చి ఇచ్చారని పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు బురఖాలో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన హంతకులను సదరు కార్పొరేటరే దగ్గరుండి మరీ మేయర్ గది వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. హత్య జరిగే సమయంలో కార్యాలయ ప్రధాన తలుపులను కార్పొరేటర్ సలహాతోనే మూసినట్లు పోలీసులు గుర్తించారు.

కార్పొరేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలను పథకం ప్రకారమే తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజానికి సీసీ కెమెరాలు గత కొంత కాలంగా బాగానే పనిచేస్తున్నాయి. కాని హత్యలకు కొద్ది రోజుల ముందు నుంచి వివిధ కారణాలతో తొలగించారు. కొన్నింటికి వైర్లు కట్ చేశారు. ఇదంతా హత్యకు ముందస్తు ప్లాన్‌లో భాగంగానే చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలను ఎవరు తొలగించారు… అవి ఎందుకు పనిచేయడం లేదన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: చంపుతానని హెచ్చరించినా.. ఊతపదమంటూ ఊరుకున్నారు

First Published:  22 Nov 2015 9:00 AM IST
Next Story