Telugu Global
Others

కడప జిల్లాలో గోతుల భయం

కడప జిల్లాలో ఓ గ్రామం భూమిని చూసి వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడ గోతులు పడుతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. హఠాత్తుగా బావి తరహాలో భారీ గోతులు పడుతుండడంతో గ్రామస్తులంతా రాత్రివేళ్లలో జాగారం చేస్తున్నారు. చింతకొమ్మదిన్నె మండలం నాయనోరిపల్లెలో ఈ పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో భూమి ఒక్కసారి కుంగిపోయి 10 నుంచి 40 అడుగుల మేర గోతులు పడుతున్నాయి. తొలుత 5రోజుల క్రితం గ్రామంలో వాటర్‌ ట్యాంక్ ఇలాగే కూలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో 15 గొయ్యిలు ఏర్పడ్డాయి.  ట్యాంకు కూలిన […]

కడప జిల్లాలో గోతుల భయం
X

కడప జిల్లాలో ఓ గ్రామం భూమిని చూసి వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడ గోతులు పడుతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. హఠాత్తుగా బావి తరహాలో భారీ గోతులు పడుతుండడంతో గ్రామస్తులంతా రాత్రివేళ్లలో జాగారం చేస్తున్నారు.

kadapa groundచింతకొమ్మదిన్నె మండలం నాయనోరిపల్లెలో ఈ పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో భూమి ఒక్కసారి కుంగిపోయి 10 నుంచి 40 అడుగుల మేర గోతులు పడుతున్నాయి.

తొలుత 5రోజుల క్రితం గ్రామంలో వాటర్‌ ట్యాంక్ ఇలాగే కూలిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో 15 గొయ్యిలు ఏర్పడ్డాయి. ట్యాంకు కూలిన చోట ఏకంగా 25 మీటర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడింది. దీంతో రెండుమూడు రోజులుగా గ్రామస్తులు ఇళ్ళలో ఉండడం లేదు. రాత్రి వేళ్లలో స్కూల్ సమీపంలోకి ఎత్తైన ప్రదేశంలో అందరూ కలిసి జాగారం చేస్తున్నారు. రాత్రివేళల్లోనే ఈ గోతులు పడుతున్నాయి.

ఈనేపథ్యంలో భూగర్భ, రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామంలో పర్యటించారు. వర్షాల వల్ల భూమి కుంగిపోతోందని అధికారులు చెప్పారు. గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇళ్లు ఉన్న ప్రాంతంలో గోతులు పడితే ప్రాణనష్టం ఉంటున్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులంటున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలు ఇళ్లకు తాళం వేసి తమ బంధువుల గ్రామాలకు వెళ్లిపోయాయి. మరికొందరు తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.

First Published:  22 Nov 2015 6:19 AM IST
Next Story