పాలన ఇలాగే ఉంటే కష్టమే
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేశారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పాలనా స్తబ్ధత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు. . దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్తబ్థత నెలకొందన్నారు. మరో ఏడాది పాటు రాష్ట్రంలో పాలన ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అప్పుడు పరిస్థితి కష్టంగా ఉంటుందన్నారు. […]
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేశారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పాలనా స్తబ్ధత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు. . దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు స్తబ్థత నెలకొందన్నారు.
మరో ఏడాది పాటు రాష్ట్రంలో పాలన ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అప్పుడు పరిస్థితి కష్టంగా ఉంటుందన్నారు. ఏడాదిలోగా పరిపాలనలో మార్పులు రావాలన్నారు. ఏపీలో ఖర్చు విపరీతంగా ఉందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఒకచోట అధికార యంత్రాంగం మరోచోట ఉండడంతో పాలన ముందుకు సాగడం లేదని జేసీ అభిప్రాయపడ్డారు.