స్కైప్ లో విడాకులు
స్కైప్. స్మార్ట్‌ఫోన్ వున్న ప్రతిఒక్కరికీ పరిచయం ఉన్న యాప్. వీడియో చాట్, వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ఉపయోగపడే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ఇది. ఈ యాప్ ద్వారా టెక్స్ట్, వీడియో మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇప్పుడు స్కైప్ తో విడాకులను కూడా మంజూరు అయ్యాయి. అవును భార్య అమెరికాలో.. భర్త ఖమ్మంలో ఉన్నారు. యూఎస్ లో ఉన్న భార్యను స్కైప్ యాప్ ద్వారా విచారణ జరిపి విడాకులు మంజూరు చేసింది ఖమ్మం కోర్టు. ఖమ్మం కు చెందిన నల్లపునేని […]
BY sarvi21 Nov 2015 6:31 PM IST
X
sarvi Updated On: 22 Nov 2015 7:04 AM IST
స్కైప్. స్మార్ట్‌ఫోన్ వున్న ప్రతిఒక్కరికీ పరిచయం ఉన్న యాప్. వీడియో చాట్, వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ఉపయోగపడే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ఇది. ఈ యాప్ ద్వారా టెక్స్ట్, వీడియో మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇప్పుడు స్కైప్ తో విడాకులను కూడా మంజూరు అయ్యాయి. అవును భార్య అమెరికాలో.. భర్త ఖమ్మంలో ఉన్నారు. యూఎస్ లో ఉన్న భార్యను స్కైప్ యాప్ ద్వారా విచారణ జరిపి విడాకులు మంజూరు చేసింది ఖమ్మం కోర్టు.
ఖమ్మం కు చెందిన నల్లపునేని కిరణ్‌కుమార్, కేతినేని పావని 2012 మార్చి 9న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొత్తలోనే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. పెళ్లిని రద్దు చేసి విడాకులు మంజూరు చేయాలంటూ కిరణ్‌కుమార్ 2012 జూన్ 8న ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విడాకుల పిటిషన్ చేశారు. మరోవైపు కేతినేని పావని కూడా వరకట్నం కోసం వేధించారంటూ కిరణ్‌కుమార్‌తోపాటు తల్లిదండ్రులపై 2013లో హైదరాబాద్ 13వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మూడేళ్లుగా విచారణ సాగుతోంది. చివరకు ఇరు కుటుంబాలు విడాకులు తీసుకోవడానికి రాజీకి వచ్చాయి.
అయితే పావని అమెరికాలో ఉండడంతో ఖమ్మం కోర్టుకు వచ్చి విడాకులకు అంగీకారం తెలపడానికి సమయం కుదరలేదు. దీంతో కోర్టు స్కైప్ ద్వారా అమెరికాలో ఉన్న పావనిని జడ్జి విచారించారు. విడాకులకు పావని అంగీకరించడంతో ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి మర్రిపాటి వెంకట రమణ ఆమె సమ్మతిని స్కైప్ ద్వారా నమోదుచేసి విడాకులు మంజూరు చేశారు. కాగా, స్కైప్ ద్వారా కోర్టు తీర్పు వెలువడటం దేశంలో ఇది రెండోసారి. తెలంగాణలో ఇదే తొలిసారి. మొదట మద్రాసు రాష్ట్ర హైకోర్టు జడ్జిగా వున్న జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు స్కైప్ ద్వారా తొలి తీర్పునిచ్చారు.
Next Story