Telugu Global
Others

వరద పోటు-ఆరంభంలో ఆనందిస్తూ గడిపారా?

భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో సంభవించిన వరదలను ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమవడం వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. వారం ముందు నుంచే భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో నిత్యం కొండచెరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వందలాది చెరువులకు గండ్లు పడ్డాయి. ఇంత జరిగినా ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ, ఉన్నతాధికారులుగానీ పరిస్థితి చేయి దాటిపోయేంత వరకు ఎందుకు స్పందించలేకపోయారన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతర్గత సంభాషణల్లో నేతలు చెబుతున్నదేమిటంటే… రాయలసీమ, నెల్లూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతుంటే దాని తీవ్రతను అంచనా […]

వరద పోటు-ఆరంభంలో ఆనందిస్తూ గడిపారా?
X

భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో సంభవించిన వరదలను ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమవడం వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. వారం ముందు నుంచే భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో నిత్యం కొండచెరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో వందలాది చెరువులకు గండ్లు పడ్డాయి. ఇంత జరిగినా ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ, ఉన్నతాధికారులుగానీ పరిస్థితి చేయి దాటిపోయేంత వరకు ఎందుకు స్పందించలేకపోయారన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతర్గత సంభాషణల్లో నేతలు చెబుతున్నదేమిటంటే…

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతుంటే దాని తీవ్రతను అంచనా వేయలేకపోయారట. పైగా రాయలసీమలో కరువు తీరా వర్షాలు పడుతున్నాయంటూ టీడీపీ అగ్రనేతలు ఆనందిస్తూ గడిపారని చెబుతున్నారు. నెల్లూరులో వర్షాల వల్ల ప్రాజెక్టులు నిండుతాయని అంచనాలు వేసుకుంటూ ఉండిపోయారు. అయితే రోజులు గడిచే కొద్ది ఊర్లకు ఊర్లు నీట మునగడం ప్రారంభమయ్యే సరికి ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది.. నెల్లూరు జిల్లాలో హైవే తెగిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది లారీలు అగిపోవడంతో పరిస్థితి తీవ్రత ప్రభుత్వానికి అప్పుడు అర్థమైంది. ఇంత జరిగినా మంత్రులు మాత్రం రంగంలోకి దిగలేదు. విపత్తు నిర్వాహణ శాఖను కూడా చూసే హోంమంత్రి చినరాజప్ప పత్తా లేకుండా పోయారు.

మంత్రులే కాదు టెక్నాలజీతో ఏదైనా ముందే కనిపెట్టేస్తా అని చెప్పే చంద్రబాబు కూడా వర్షాలతో కరువు తీరుతుందన్న ఆలోచనతోనే రోజులు గడిపేశారు. దీంతో జరగాల్సిన నష్టం భారీ స్థాయిలో జరిగిపోయింది. గూడూరు, నెల్లూరు శివారు ప్రాంతాలతో పాటు జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. అక్కడి జనానికి రెండు మూడు రోజుల పాటు నిత్యావసర వస్తువులు కూడా దొరకలేదు. పరిస్థితిని అంచనా వేయడంలో నిర్లక్ష్యం కారణంగా అప్పటికప్పుడు సహాయకచర్యలను వేగవంతం చేయడంతోనూ యంత్రాంగం తడబడింది. మొత్తం మీద చంద్రబాబు హయాంలో వర్షాలు పడవన్న భావన తొలగిపోతుందనుకుంటే తీరా
పరిస్థితి వరదగా మారిందని తెలుగు తమ్ముళ్లు బాధపడుతున్నారు.

గత ఏడాది వచ్చిన హుదూద్‌ తుఫానప్పుడుకూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చాలా ప్రమాదకరమైన తుఫాను రాబోతుందని అంతర్జాతీయ సంస్థలు, కేంద్రప్రభుత్వం నుంచి హెచ్చరికలు అందినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తీరా తుఫానువల్ల తీవ్రనష్టం జరిగాక ఉలిక్కిపడ్డ ప్రభుత్వం చెడ్డపేరురాకుండా జాగ్రత్తలు పడింది. చంద్రబాబు విశాఖచేరుకుని రోడ్లమీద కొమ్మలు తీసేయడం, ఒరిగిపడ్డ స్థంబాలను పక్కకు జరపడం, మార్గాలు సుగమం చేయడంలాంటి పనులు చేసి తాను ఒంటిచేత్తో పరిస్థితి చక్కదిద్దానన్న ఇమేజ్‌ ఇచ్చాడు. మీడియా సహకారంతో తుఫాను బాధితుల్ని ఆయన ఒంటిచేత్తో ఆదుకున్న ఫీలింగ్‌ కల్పించాడు.

ఇప్పుడుకూడా అదే పరిస్థితి. ముందే ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నెల్లూరుజిల్లా అతలాకుతలం అయ్యాక ఇప్పుడు రంగంలోకి దిగాడు. మీడియా సహకారంతో మళ్లీ ఒంటిచేత్తో పరిస్థితిని చక్కదిద్దనున్నాడు. ఈ సీన్‌ మిగతాజిల్లాలలో సక్సెస్‌ అవుతుంది కాని నానా బాధలుపడ్డ నెల్లూరుజిల్లా వాసులు మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మర్చిపోరని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు.

First Published:  21 Nov 2015 7:59 AM IST
Next Story