Telugu Global
Others

మీడియా ముందు గంగిరెడ్డి భార్య

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కొల్లం గంగిరెడ్డి సతీమణి మాళవిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తన భర్త గంగిరెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలులోగాని, కోర్టుకు తీసుకెళ్లే సమయంలోగాని చంపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అలిపిరి కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారామె. కోర్టులో గంగిరెడ్డి ఎవరో తనకు తెలియదని స్వయంగా చంద్రబాబే చెప్పారని ఆమె గుర్తు చేశారు. తన భర్త మీద రెండు కేసులు మాత్రమే […]

మీడియా ముందు గంగిరెడ్డి భార్య
X

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కొల్లం గంగిరెడ్డి సతీమణి మాళవిక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తన భర్త గంగిరెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలులోగాని, కోర్టుకు తీసుకెళ్లే సమయంలోగాని చంపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అలిపిరి కేసుతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదన్నారామె.

కోర్టులో గంగిరెడ్డి ఎవరో తనకు తెలియదని స్వయంగా చంద్రబాబే చెప్పారని ఆమె గుర్తు చేశారు. తన భర్త మీద రెండు కేసులు మాత్రమే ఉండేవని.. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా 26 కేసులు నమోదు చేశారని చెప్పారు. తన భర్త కేసును ఈ స్థాయిలో ఎందుకు హైప్ చేస్తున్నారని ప్రశ్నించారు. తన భర్తపై లేనిపోని కేసులు బనాయించి చివరకు ప్రాణ హాని తలపెడుతారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యాపారం నిమిత్తమే తన భర్త దుబాయ్ వెళ్లారని చెప్పారు. ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని లేదంటూ గంగిరెడ్డి చెప్పిన మాటలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా…మారిషస్ నుంచి తీసుకొచ్చే సమయంలో తుపాకీ పెట్టి పోలీసులు తన భర్తను బెదిరించారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా మీడియాతో చెబితే చంపేస్తామని బెదిరించారని మాళవిక వెల్లడించారు.

బస్సులో వెళ్తున్న 20 మంది ఎర్రచందనం కూలీలను పట్టుకొచ్చి ఎన్‌కౌంటర్ చేయించారని తన భర్తకు కూడా చంద్రబాబు అలాగే చేస్తారేమోనన్న భయం ఉందన్నారు. తమ కుటుంబం నాటుసార అమ్ముకుని పైకి వచ్చిదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. తమ తాతల కాలం నుంచే రాజకీయాల్లో తమ కుటుంబం ఉందని మాళవిక చెప్పారు. తన భర్తను కోర్టులే కాపాడాలని ఆమె కోరారు.

First Published:  21 Nov 2015 11:05 AM IST
Next Story