కరీనాతో సెల్ఫీ-వివాదంలో రమణ్ సింగ్
సెల్ఫీల మోజు కేవలం యూత్ కే కాదు. ఈమధ్య అందరికీ అలవాటుగా మారింది. అయితే కొన్నిసార్లు సెల్ఫీలు కూడా వివాదాస్పదం అవుతాయి. అందుకు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఉదంతమే నిదర్శనం. చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా, రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా […]
సెల్ఫీల మోజు కేవలం యూత్ కే కాదు. ఈమధ్య అందరికీ అలవాటుగా మారింది. అయితే కొన్నిసార్లు సెల్ఫీలు కూడా వివాదాస్పదం అవుతాయి. అందుకు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఉదంతమే నిదర్శనం.
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా, రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ టీచర్లకు కరీనా, రమణ్ సింగ్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కరీనాతో సెల్ఫీ తీసుకుంటూ రమణ్ సింగ్ కెమెరాకి చిక్కారు. ఇంకేముంది.. రమణ్ సింగ్ పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి..
రాష్ట్రం రైతుల ఆత్మహత్యలతో అతలాకుతలం అవుతుంటే.. సీఎం సినీతారలతో సెల్ఫీలు దిగుతున్నారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం చేయాల్సిన పని ఇదేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను పట్టించుకోకుండా సినీ తారలతో సీఎం సెల్ఫీలు దిగడమేంటని కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాగెల్ మండిపడ్డారు. సరదాగా సెల్ఫీ తీసుకుందామనుకున్న సీఎం రమణ్ సింగ్ కు ఇలా విమర్శలు రావడం ఇబ్బందికరంగా మారింది.