Telugu Global
Others

టీఆర్ఎస్ నాయకులను రిలీజ్ చేసిన మావోలు

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల చెర నుంచి టీఆర్ఎస్ నాయకులు విడుదల అయ్యారు. తెల్లవారుజామున చర్ల అటవీ ప్రాంతం నుంచి పూసుగప్పకు 30 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు టీఆర్ఎస్ నాయకులను వదిలివెళ్లారు. రెండు రోజుల క్రితం భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు కిడ్నాప్ చేశారు. అయితే మావోయిస్టులు టీఆర్ఎస్ నేతలకు ఏమైనా డిమాండ్లు పెట్టారా? అన్నది ఇంకా తెలియలేదు. టీఆర్ఎస్ నాయకులు విడుదల కావడంపై […]

టీఆర్ఎస్ నాయకులను రిలీజ్ చేసిన మావోలు
X

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల చెర నుంచి టీఆర్ఎస్ నాయకులు విడుదల అయ్యారు. తెల్లవారుజామున చర్ల అటవీ ప్రాంతం నుంచి పూసుగప్పకు 30 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు టీఆర్ఎస్ నాయకులను వదిలివెళ్లారు. రెండు రోజుల క్రితం భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు కిడ్నాప్ చేశారు. అయితే మావోయిస్టులు టీఆర్ఎస్ నేతలకు ఏమైనా డిమాండ్లు పెట్టారా? అన్నది ఇంకా తెలియలేదు. టీఆర్ఎస్ నాయకులు విడుదల కావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ నేతల కిడ్నాప్ సమయంలో మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌పేరిట ఓ లేఖను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అన్న కేసీఆర్ బూటకపు ఎన్ కౌంటర్లతో రక్తపాతం సృష్టిస్తున్నారని, పోలీసు రాజ్యం నడుస్తోందని మావోయిస్టులు లేఖలో మండిపడ్డారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికే టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసినట్లు మావోయిస్టులు తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.

First Published:  21 Nov 2015 5:23 AM IST
Next Story