పొలిటికల్ ఎంట్రీపై నారా బ్రహ్మణి కామెంట్
చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేయబోయే కార్యక్రమాలను వివరించారు. గ్రూప్ వన్, గ్రూప్ టూ పరీక్షల కోసం పేద విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారామె. తెలుగు రాష్ట్రాలకు మంచి అధికారులను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని మీడియా ప్రతినిధులు బ్రాహ్మణిని ప్రశ్నించారు. ప్రస్తుతానికి రాలేనని..హెరిటేజ్ బాధ్యతలపై, ట్రస్టు సేవలపై దృష్టిపెట్టానని చెప్పారు. […]

చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేయబోయే కార్యక్రమాలను వివరించారు. గ్రూప్ వన్, గ్రూప్ టూ పరీక్షల కోసం పేద విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారామె. తెలుగు రాష్ట్రాలకు మంచి అధికారులను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని మీడియా ప్రతినిధులు బ్రాహ్మణిని ప్రశ్నించారు. ప్రస్తుతానికి రాలేనని..హెరిటేజ్ బాధ్యతలపై, ట్రస్టు సేవలపై దృష్టిపెట్టానని చెప్పారు. అంతేకాని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని మాత్రం ఆమె చెప్పలేదు.