మతాంతర వివాహాలపై... మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వివాహం చేసుకునే వారు ఎవరైనా.. ఏదో ఒక మతంలోకి మారాల్సిందేనని స్పష్టం చేసింది. వధూ వరుల్లో ఏఒక్కరు మతం మారకపోయినా ఆ పెళ్లి చెల్లదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతానికి చెందిన ఓ వ్యక్తి హిందూ మతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లిని అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు […]
BY sarvi20 Nov 2015 5:41 AM IST
X
sarvi Updated On: 21 Nov 2015 4:21 AM IST
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వివాహం చేసుకునే వారు ఎవరైనా.. ఏదో ఒక మతంలోకి మారాల్సిందేనని స్పష్టం చేసింది. వధూ వరుల్లో ఏఒక్కరు మతం మారకపోయినా ఆ పెళ్లి చెల్లదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతానికి చెందిన ఓ వ్యక్తి హిందూ మతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లిని అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పెళ్లి ఏవిధంగా చేసుకున్నారని న్యాయమూర్తి అడిగితే హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడి గుళ్లో చేసుకున్నా మని చెప్పింది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఆర్. శివకుమార్, జస్టిస్ వి.ఎస్.రవి తీర్పును వెలువరించారు. ఆ ప్రకారం ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవాలనుకుంటే ముందు వారిలో ఒకరు మరొకరి మతాన్ని స్వీకరించాలని ఆతర్వాత జరిగే పెళ్లి చెల్లుతుందని తీర్పునిచ్చారు. అయితే ఇక్కడ మరో వెసులుబాటు మాత్రం కోర్టు ఇచ్చింది. ఒకవేళ ఎవరి మతాలు వారు కొనసాగించుకోవాలి అనుకుంటే వధూవరులు 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం నమోదు చేసుకోవాల్సి వుంటుందని మద్రాసు హైకోర్టు తన తీర్పులో వివరించింది. అదే సమయంలో మేజర్ అయిన యువతికి ఎక్కడికైనా వెళ్లి నివసించే హక్కు ఉంటుందని, ఆమెకు తల్లిదండ్రులు, ఇతరుల రక్షణ అవసరం లేదని కూడా మద్రాసు హైకోర్టు చెప్పింది.
Next Story