కుమారి 21 ఎఫ్ సినిమా రివ్యూ
రేటింగ్: 2.5/5 టైటిల్ : కుమారి 21 ఎఫ్ జానర్ : రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తారాగణం : రాజ్ తరుణ్, హేబాపటేల్, నోయల్, హేమ దర్శకత్వం : సూర్య ప్రతాప్ పల్నాటి కథ, స్క్రీన్ ప్లే : సుకుమార్ నిర్మాత : సుకుమార్ రైటింగ్స్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ పెద్ద వాళ్ల అందరు కలసి ఒక చిన్న సినిమాకు పని చేయడం నిజంగా రాజ్ తరుణ్ కు మంచి లక్ అనే చెప్పాలి. […]
రేటింగ్: 2.5/5
టైటిల్ : కుమారి 21 ఎఫ్
జానర్ : రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్
తారాగణం : రాజ్ తరుణ్, హేబాపటేల్, నోయల్, హేమ
దర్శకత్వం : సూర్య ప్రతాప్ పల్నాటి
కథ, స్క్రీన్ ప్లే : సుకుమార్
నిర్మాత : సుకుమార్ రైటింగ్స్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
పెద్ద వాళ్ల అందరు కలసి ఒక చిన్న సినిమాకు పని చేయడం నిజంగా రాజ్ తరుణ్ కు మంచి లక్ అనే చెప్పాలి. ఈ మధ్య వచ్చిన సినిమా చూపిస్తా మామ చిత్రంతో అందరికి కనెక్ట్ అయ్యాడు. హీరోగా ఎస్టాబ్లీష్ అవుతున్నాడు. ఇటువంటి సమయంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈసినిమాను ప్రొడ్యూస్ చేయడం.. దేవి శ్రీ ప్రసాద్ వంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంగీతం అందించడం.. రత్నవేలు వంటి ఒక బెస్ట్ సినిమాటోగ్రఫి చేయడం నిజంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మరి కొద్ది పాటి అంచనాలతో వచ్చిన కుమారి 21 ఎఫ్ అభిమానుల్ని ఎంత వరకు మెప్పించిందో ఈ సమీక్ష లో చూద్దాం…..
కథ :
ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడే కుమారి అలియాస్ సిద్దూతో తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పేస్తోంది. అప్పటికే ఆ అమ్మాయిని రెండు సార్లు చూసిన సిద్దూ తన మీద ఉన్న అభిప్రాయం వల్ల ఆ విషయాన్ని సీరియస్ గాతీసుకోడు. నెమ్మదిగా వారి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ఈ సమయంలో కూడా కుమారి ప్రవర్తన, తన స్నేహితులు చెప్పిన కొన్ని విషయాల మూలంగా తనను ప్రేమించాలా..? వద్దా..? అన్న సందిగ్ధంలో పడతాడు.అదే సమయంలో స్నేహితుల మాటలు విని కుమారికి దూరమవ్వాలనే ప్రయత్నంలో, మరో అమ్మాయితో స్నేహం చేస్తాడు. కానీ చాలా రోజులుగా తమకు దూరంగా ఉంటున్న తండ్రి గురించి ఓ నిజం తెలుసుకొని కుమారికి తన ప్రేమను చెప్పేయాలనుకుంటాడు. అనుకున్నట్టుగా సిద్దూ తన ప్రేమను కుమారికి చెప్పాడా..? తన ఫ్రెండ్స్ వల్ల సిద్దూ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..? కాలనీకి రాకముందు కుమారి గతం ఏంటి..? చివరకు ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడి సిద్దూ, కుమారి ఒక్కటయ్యారా..? అన్నదే సినిమా కథ. వినడానికి అనేక ట్విస్ట్ లతో బలే వుందనిపిస్తుంది..!
నటీనటులు పెర్ఫార్మేన్స్..!
ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించిన రాజ్ తరుణ్ ఈ సినిమాలో కాస్త బరువైన పాత్రనే ఎంచుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే మోస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. క్లైమాక్స్ లో వచ్చిన సెంటిమెంట్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. అమాయకత్వం, నిజాయితీ, మంచితనాన్ని బాగా చూపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన హేబా పటేల్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. క్యూట్ లుక్స్ తో పాటు బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది హేబా. నటన పరంగా పెద్దగా మెప్పించకపోయినా, గ్లామర్ షోతో మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. తొలిసారిగా నెగెటివ్ రోల్ లో కనిపించిన నోయల్ మంచి నటన కనబరిచాడు.
సాంకేతిక నిపుణులు :
ఈ సినిమాకు దర్శకుడిగా సూర్య ప్రతాప్ పేరు పడినా సినిమా అంతా సుకుమార్ స్టైల్ లోనే సాగుతుంది. సుకుమార్ మార్క్ టిపికల్ క్యారెక్టర్స్, ఐటమ్ సాంగ్స్, స్క్రీన్ ప్లే స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మొదటి నుంచి సినిమా మీద అంచనాలను పెంచిన దేవిశ్రీ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫి ఆకట్టుకుంది. అయితే పాటల కన్నా నేపథ్య సంగీతం మరింతగా ఆకట్టుకుంది. సుకుమార్ కథా స్క్రీన్ ప్లే తన స్టైల్ లో రెగ్యులర్ గా సాగిపోయినా, కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సుకుమార్ స్క్రిప్ట్
రాజ్ తరుణ్ యాక్టింగ్
హేబా పటేల్ గ్లామర్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
స్లో నే రేషన్
విశ్లేషణ :
పేరుకు సుకుమార్ నిర్మాతే అయినా, అంతా తానే అయి కుమారి 21 ఎఫ్ సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో సుకుమార్ మార్క్ స్పష్టంగా కనిపించటంతో ఇదే వేరే దర్శకుడు తీశాడన్న ఆలోచన కూడా రాదు. మరోసారి ఎలాంటి కథాబలం లేకుండా కేవలం క్యారెక్టర్స్ తోనే కథ నడిపించే ప్రయత్నం చేశాడు సుకుమార్. చిన్న పాయింట్ ను రెండున్నర గంటల సినిమాగా మలిచే ప్రయత్నంలో చాలా సీన్లు బోర్ గా అనిపించాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో చాలా సన్నివేశాలు ఫ్యామిలీతో కలిసి చూసేలా లేవు. గతంలో ఐటమ్ సాంగ్ లో మాత్రమే గ్లామర్ పాళ్లు పెంచే సుకుమార్, ఈ సారి సినిమా అంతా అందాల ప్రదర్శననే నమ్ముకున్నట్టుగా అనిపించింది. సినిమా టైటిల్ క్యాచీగా ఉంది. అయితే అన్ని వర్గాల్ని అలరించే సినిమా గా తీర్చి దిద్దడంలో డైరెక్టర్ ఫెయిలయ్యారనే చెప్పాలి. టీనేజ్ ఆడియన్స్ కు కరెంట్ లో కనెక్ట్ అవుతుంది..!