28మంది మంత్రులతో నితీష్ ప్రమాణం
బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ నితీష్ కుమార్ తో మొదట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీహార్ సీఎంగా ప్రమాదం చేయడం ఇది ఆయనకు ఐదోసారి. నితీష్ తోపాటు మరో 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో లాలూ ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర […]
BY sarvi20 Nov 2015 7:34 AM IST
X
sarvi Updated On: 21 Nov 2015 4:21 AM IST
బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ నితీష్ కుమార్ తో మొదట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బీహార్ సీఎంగా ప్రమాదం చేయడం ఇది ఆయనకు ఐదోసారి. నితీష్ తోపాటు మరో 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో లాలూ ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దేవగౌడతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు.
ముందే ఊహించినట్టే లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ ప్రమాణం అయిన వెంటనే వీరి చేత గవర్నర్ చేయించారు. వీరిలో లాలూ చిన్నకొడుకు తేజస్వి యాదవ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి.
Next Story