బాహుబలి కన్నా టెంపర్ సత్తానే ఎక్కువా..?
బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. రాజమౌళి ప్రత్యేక శ్రద్ధతో అద్బుత దృశ్యకావ్యంగా మలిచిన ఈ సినిమా బాలీవుడ్ అగ్రహీరోలకు చెమటలు పట్టించింది. దాదాపు 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అమీర్‌ఖాన్ పీకే తరువాత అంతటి భారీ వసూళ్లు చేసిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలై నెలలు దాటినా.. ఓవర్సీస్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ […]
బాహుబలి సినిమా తెలుగు ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. రాజమౌళి ప్రత్యేక శ్రద్ధతో అద్బుత దృశ్యకావ్యంగా మలిచిన ఈ సినిమా బాలీవుడ్ అగ్రహీరోలకు చెమటలు పట్టించింది. దాదాపు 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి అమీర్‌ఖాన్ పీకే తరువాత అంతటి భారీ వసూళ్లు చేసిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రాంతాల్లో విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలై నెలలు దాటినా.. ఓవర్సీస్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ కొనసాగుతుండటం విశేషం. అయితే, ఇన్ని రికార్డులను తిరగరాసిన బాహుబలి ఒక్క విషయంలో మాత్రం వెనకబడి పోయింది. అదేనండీ జూనియర్ నటించిన సూపర్ హిట్ సినిమా టెంపర్ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది.
యాడ్ల మధ్యలో సినిమా!
విషయమేంటంటే.. ఇటీవల దసరా సందర్భంగా బాహుబలి సినిమాను ప్రసారం చేశారు. ఈ సినిమా టీవీ రికార్డులను కూడా తిరగరాస్తుందని అంతా అనుకున్నారు. అయితే మాటీవీకి ఇది తీవ్ర నిరాశనే మిగిల్చింది. రూ.25 కోట్లు పెట్టి ఈ చిత్రం తెలుగు ప్రసారాలను కొనుగోలు చేసిన మాటీవీకి వచ్చిన టీఆర్‌పీ రేటింగ్ కేవలం 21 పాయింట్లేనని తెలిసింది. అంతకుముందు జెమినీలో ప్రసారం చేసిన జూనియర్ సినిమా టెంపర్‌కి అనూహ్యంగా టీఆర్‌పీ రేటింగ్ 28 పాయింట్లు వచ్చాయి. ఈ రికార్డును బాహుబలి బద్దలు కొడుతుందనుకున్నా అది జరగలేదు. దీనికి సినిమా మధ్యలో మాటీవీ ప్రసారం చేసిన యాడ్లే కారణమంట. సినిమా మధ్యలో యాడ్లకు బదులు, యాడ్ల మధ్యలో సినిమా ప్రసారం చేయడంతో విసుగుచెందిన ప్రేక్షకులు చానల్ తిప్పేశారు. కానీ, ఈ సినిమా ప్రసారం చేసిన సమయంలో యాడ్ల రూపంలో మాటీవీకి దండిగానే లాభాలు వచ్చాయి. అయితే రికార్డు మాత్రం దక్కకుండా పోయింది.