Telugu Global
NEWS

ఇద్దరు మంత్రుల ఆవేదన

ఏపీ మంత్రుల్లో అసంతృప్తి మరోసారి బట్టబయలైంది. సోమవారం విజయవాడలో కేబినెట్ భేటీ సందర్భంగా జరిగిన సంఘటన ఇందుకు కారణమైంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై చర్చ సందర్భంగా చంద్రబాబు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు ముంచెత్తుతుంటే విపత్తు నిర్వాహణ శాఖను కూడా నిర్వహిస్తున్న మంత్రిగా చినరాజప్ప, జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమ ఏం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వెంటనే కంట్రోల్ రూమ్‌లు […]

ఇద్దరు మంత్రుల ఆవేదన
X

ఏపీ మంత్రుల్లో అసంతృప్తి మరోసారి బట్టబయలైంది. సోమవారం విజయవాడలో కేబినెట్ భేటీ సందర్భంగా జరిగిన సంఘటన ఇందుకు కారణమైంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై చర్చ సందర్భంగా చంద్రబాబు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు ముంచెత్తుతుంటే విపత్తు నిర్వాహణ శాఖను కూడా నిర్వహిస్తున్న మంత్రిగా చినరాజప్ప, జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమ ఏం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

వెంటనే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిస్థితిని సమీక్షించాలన్న విషయం తెలియదా అని చినరాజప్పపై రుసరుసలాడారట. చినరాజప్పను మాత్రమే తిట్టకుండా దేవినేని ఉమపైనా బాబు ఫైర్ అయ్యారు. భారీ వర్షాలకు చెరువులకు గండ్లు పడుతుంటే వాటి మరమ్మతులపై యుద్ధప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం లేదా అంటూ ఉమను ప్రశ్నించారు. సహచర మంత్రుల ముందే తమను నిలదీయడంతో ఇద్దరు మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. అయితే..

కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు మంత్రుల్లో ఒక మంత్రి సన్నిహితుల దగ్గర ఓపెన్ అయిపోయారు. పేరుకు తనను మంత్రిని చేశారు గానీ… శాఖపై తనకు అధికారాలెక్కడున్నాయని వాపోయారు. తన శాఖకు సంబంధించిన అధికారాలను ఎప్పుడో సీఎం కుటుంబసభ్యులు హైజాక్ చేశారని మండిపడ్డారు.. కనీసం అధికారుల బదిలీలోనూ తనను కరివేపాకులా తీసి పారేస్తున్నారని ఆవేదన చెందారని సమాచారం. ముఖ్యమంత్రి తీరును చూసే అధికారులు కూడా తనకు మర్యాద ఇవ్వడం లేదని ఆక్రోశించారు. ఇలా తన శాఖను మొత్తం స్వాధీనం చేసుకున్న వారు .. ఆ వరద సంగతి కూడా చూసుకోవచ్చుకదా..! నన్ను ఎందుకు బదనాం చేయడం అంటూ సదరు మంత్రి సన్నిహితుల వద్ద వాపోయారు.

First Published:  18 Nov 2015 10:07 AM IST
Next Story