Telugu Global
Cinema & Entertainment

నాగచైతన్య పెళ్లి కబురు..?

త్వరలోనే నాగచైతన్య పెళ్లిపీటలు ఎక్కనున్నాడా.. ఓ ఇంటివాడు కాబోతున్నాడా.. అవుననే అంటోంది ఫిలిం సర్కిల్. అతి త్వరలో అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగనుందని వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కొన్నేళ్లుగా నాగచైతన్య ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే చైతూ ప్రేమిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి ఇప్పటివరకు తెరపై మాత్రం కనిపించలేదట. అంతేకాదు.. మరో ఖాస్ ఖబర్ ఏంటంటే.. తన పుట్టినరోజు నాడు.. అంటే ఈనెల 23న తన […]

నాగచైతన్య పెళ్లి కబురు..?
X
త్వరలోనే నాగచైతన్య పెళ్లిపీటలు ఎక్కనున్నాడా.. ఓ ఇంటివాడు కాబోతున్నాడా.. అవుననే అంటోంది ఫిలిం సర్కిల్. అతి త్వరలో అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగనుందని వార్తలొస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కొన్నేళ్లుగా నాగచైతన్య ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే చైతూ ప్రేమిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి ఇప్పటివరకు తెరపై మాత్రం కనిపించలేదట. అంతేకాదు.. మరో ఖాస్ ఖబర్ ఏంటంటే.. తన పుట్టినరోజు నాడు.. అంటే ఈనెల 23న తన మనసులోని అమ్మాయి గురించి మీడియాకు చెప్పే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇంత సడెన్ గా నాగచైతన్య ప్రేమ-పెళ్లికి సంబంధించిన రూమర్లు పుట్టుకురావడం ఇండస్ట్రీలో చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అటు నాగార్జున మాత్రం నాగచైతన్యకు పెళ్లి చేయాలని చాలా రోజులుగా ట్రైచేస్తున్నట్టు మాత్రం తెలుస్తోంది. తన పుట్టినరోజు నాడు ఈ పుకార్లన్నింటిపై నాగచైతన్య సమాధానం ఇవ్వనున్నాడు. ఇవన్నీ రూమర్లేనా లేక ఇందులో కొంతయినా వాస్తవం ఉందా అనే విషయంపై చైతూ క్లారిటీ ఇవ్వనున్నాడు.
First Published:  18 Nov 2015 12:36 AM IST
Next Story