అనురాధ హత్య- ముందే కూసిన కోయిల!
నాయకులు ఎవరైనా చనిపోయినప్పుడు ప్రజల భావోద్వేగాలు ఒక్కసారిగా పెరుగుతాయి. అందులోనూ హత్యలాంటివి జరిగినప్పుడు అభిమానులు విచక్షణ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సున్నిత సమయాల్లో జనం,అభిమానులు రెచ్చిపోకుండా చూడాల్సిన బాధ్యత మిగిలిన నాయకులపై, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీపై ఉంటుంది. కానీ చిత్తూరు మేయర్ అనురాధ హత్య జరిగి గంటలు కూడా గడవకముందే కొందరు అధికార పార్టీ నేతలు చేసిన ఆరోపణలు వేడిని పెంచాయి. ముఖ్యంగా అనురాధ హత్య జరిగిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే బోండా […]
నాయకులు ఎవరైనా చనిపోయినప్పుడు ప్రజల భావోద్వేగాలు ఒక్కసారిగా పెరుగుతాయి. అందులోనూ హత్యలాంటివి జరిగినప్పుడు అభిమానులు విచక్షణ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సున్నిత సమయాల్లో జనం,అభిమానులు రెచ్చిపోకుండా చూడాల్సిన బాధ్యత మిగిలిన నాయకులపై, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీపై ఉంటుంది. కానీ చిత్తూరు మేయర్ అనురాధ హత్య జరిగి గంటలు కూడా గడవకముందే కొందరు అధికార పార్టీ నేతలు చేసిన ఆరోపణలు వేడిని పెంచాయి. ముఖ్యంగా అనురాధ హత్య జరిగిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రెస్‌మీట్ పెట్టి వ్యవహారానికి రాజకీయ కోణంలోకి మళ్లించి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చారు.
ఎన్నో హత్యలు జరిగాయి. ఎంత నీచులైనా సరే మహిళను మాత్రం హత్యచేయలేదని బోండా ఉమా చెప్పారు. అనురాధ దంపతులపై దాడి వెనుక వైసీపీ నేత సీకే బాబు హస్తం ఉందని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండతోనే ఈ హత్యలకు కుట్ర జరిగిందన్నారు. హత్య జరిగి కొన్ని గంటలు కూడా గడవకుముందే… పోలీసులే ఒక నిర్దారణకు రాలేని సమయంలోనే ఒక బాధ్యతయుతమైన ఎమ్మెల్యే ఇలాంటి ప్రకటన చేయడంపై అందరూ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవేళ బోండా ఉమా మాటలే నిజమని నమ్మి మేయర్ వర్గీయులు … సీకే బాబుపై, అతడి ఆస్తులపై దాడులకు దిగి ఉంటే ఏమయ్యేది?. తమ నేత హత్యకు గురైందన్న ఆవేశంలో చిత్తూరులో విధ్వసం సృష్టించి ఉంటే దానికి బాద్యత ఎవరు తీసుకునేవారు? శాంతిభద్రతలకు అదో పెను విఘాతంగా మారేది కాదా అన్నది ప్రశ్న. చివరకు అనురాధ హత్య వెనుక వైసీపీ వాళ్లు కాదు.. ఆమె బంధువు హస్తమే ఉందని దాదాపు నిర్దారణ అయింది.
అసలు చిత్తూరుజిల్లాకు చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ… అక్కడి రాజకీయాల గురించి తెలియనప్పటికీ బోండా ఉమా ఇంతగా అత్యుత్సాహం చూపడం ఏమిటని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఒకే కులం అయినంత మాత్రాన మరీ ఈ స్థాయిలో స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలాంటి సున్నిత అంశాలపై స్పందించేటప్పుడు… కుల, పార్టీ అభిమానాలను తొందరపడి ప్రదర్శించకపోవడమే మంచిదని సీనియన్ నేతలు సూచిస్తున్నారు. మరోవైపు అనురాధ హత్యకు నిరసనగా బుధవారం చిత్తూరుజిల్లా బంద్‌కు కాపునాడు పిలుపునిచ్చింది.
Also Read: ప్లాన్ A,B రెండింటిని ప్రయోగించిన హంతకులు