నెక్ట్స్ టార్గెట్ అమెరికా
ఫ్రాన్స్ రాజధాని పారిస్ పై విరుచుకుపడిన ఐసిస్ 128మందికి పైగా పౌరులను పొట్టన పెట్టుకుంది. ఈ దాడులు ఇంతటితోనే ఆగబోవని.. నెక్ట్స్ టార్గెట్ అమెరికానేనని ఐసిస్ మరోమారు ప్రకటింది. ఫ్రాన్స్ కు పట్టిన గతే అమెరికాకి పడుతుందని.. అంతకంటే భీకర దాడులు చేస్తామని ప్రకటించింది. తమ తర్వాతి టార్గెట్ వాషింగ్టన్‌పై దాడేనని ఆ వీడియోలో హెచ్చరించారు. అంతేకాదు ఇతర ఐరోపా దేశాల పైనా పారిస్ తరహా దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ఆన్‌లైన్‌లో ఐసిస్ ఓ వీడియో విడుదల […]

ఫ్రాన్స్ రాజధాని పారిస్ పై విరుచుకుపడిన ఐసిస్ 128మందికి పైగా పౌరులను పొట్టన పెట్టుకుంది. ఈ దాడులు ఇంతటితోనే ఆగబోవని.. నెక్ట్స్ టార్గెట్ అమెరికానేనని ఐసిస్ మరోమారు ప్రకటింది. ఫ్రాన్స్ కు పట్టిన గతే అమెరికాకి పడుతుందని.. అంతకంటే భీకర దాడులు చేస్తామని ప్రకటించింది. తమ తర్వాతి టార్గెట్ వాషింగ్టన్‌పై దాడేనని ఆ వీడియోలో హెచ్చరించారు.
అంతేకాదు ఇతర ఐరోపా దేశాల పైనా పారిస్ తరహా దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ఆన్‌లైన్‌లో ఐసిస్ ఓ వీడియో విడుదల చేసింది. సిరియాపై వైమానిక దాడులు చేస్తున్న దేశాలకు ఫ్రాన్స్ గతే పడుతుందని, ఆ దేశాల్లో కూడా పారిస్ తరహా దాడులు జరుపుతామని హెచ్చరించింది. సిరియాలో ఫ్రాన్స్ జరుపుతున్న వైమానిక దాడులను క్రూసెడర్ క్యాంపెయిన్‌గా ఐసిస్ అభివర్ణించింది.