Telugu Global
Others

అనురాధ హత్య... చింటూ వెన్నుపోటా..?

చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేయించింది కుటుంబసభ్యులేనని గుర్తించారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపారు. హత్యాస్థలి నుంచి జాగిలాలు నేరుగా చింటూ ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో చింటూపై అనుమానాలు బలపడుతున్నాయి. చింటూ అలియాస్ చంద్రశేఖర్ … కఠారి మోహన్‌కు మేనల్లుడు. చింటూతో అనురాధ, ఆమె భర్తకు ఆస్తి వివాదాలున్నాయి. రాజకీయంగా అధిపత్యపోరు కూడా నడుస్తోంది. రాజకీయంగా అనురాధ కుటుంబం ఆధిపత్యాన్ని చింటూ భరించలేకపోయేవాడని […]

అనురాధ హత్య... చింటూ వెన్నుపోటా..?
X

చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేయించింది కుటుంబసభ్యులేనని గుర్తించారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపారు. హత్యాస్థలి నుంచి జాగిలాలు నేరుగా చింటూ ఇంటి వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో చింటూపై అనుమానాలు బలపడుతున్నాయి. చింటూ అలియాస్ చంద్రశేఖర్ … కఠారి మోహన్‌కు మేనల్లుడు. చింటూతో అనురాధ, ఆమె భర్తకు ఆస్తి వివాదాలున్నాయి. రాజకీయంగా అధిపత్యపోరు కూడా నడుస్తోంది. రాజకీయంగా అనురాధ కుటుంబం ఆధిపత్యాన్ని చింటూ భరించలేకపోయేవాడని తెలుస్తోంది.

ఎంటెక్ చదువుకున్న చింటూ నేరచరిత్ర కలిగివున్నాడు. 2004లో ఓ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. చింటూ నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో తనకు సెక్యురిటీ పెంచాలని ఎస్పీ కార్యాలయానికి అనురాధ ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. మేయర్ వర్గీయులు కూడా చింటూపైనే ఆరోపణలు చేస్తున్నారు. చింటూ కార్యాలయంపై దాడి చేశారు.అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. డబ్బు విషయంలో చింటూకు, మోహన్‌కి మధ్య తాజాగా వివాదం తలెత్తినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ డ్రైవర్‌ వెంకటచలపతి, రెడ్డప్ప, మంజునాథ, వెంకటేష్‌లతో కలిసి మోహన్‌ హత్యకు చింటూ కుట్ర పన్నాడు.

Also Read: అనురాధ హ‌త్య జ‌రిగిన తీరు ఇది

First Published:  17 Nov 2015 11:42 AM IST
Next Story