సంచలనం రేపిన ఆజంఖాన్ వ్యాఖ్యలు
పారిస్ పై ఉగ్రదాడితో పంజా విసిరిన ఐఎస్ ఐఎస్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఈ దాడులను ఖండిస్తూనే ఇరాన్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ మొదలైన ముస్లిం దేశాలపై ఆయిల్‌కోసం దాడులు జరిపి లక్షలాదిమంది అమాయక ముస్లిం పౌరులను హతమార్చిన దేశాలపై ఇవి ప్రతీకార దాడులని అన్నారు. ప్రపంచం ప్రశాంతంగా వున్న సమయంలో ఆయిల్‌కోసం , ఆయా దేశాల నాయకత్వాలను గుప్పెట్లో పెట్టుకోవడంకోసం ఎవరు ముందు దాడిచేశారు? ఎవరు నరమేధం జరిపారు? వేలాదిమంది […]
BY sarvi17 Nov 2015 4:35 AM IST
X
sarvi Updated On: 18 Nov 2015 4:55 AM IST
పారిస్ పై ఉగ్రదాడితో పంజా విసిరిన ఐఎస్ ఐఎస్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఈ దాడులను ఖండిస్తూనే ఇరాన్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ మొదలైన ముస్లిం దేశాలపై ఆయిల్‌కోసం దాడులు జరిపి లక్షలాదిమంది అమాయక ముస్లిం పౌరులను హతమార్చిన దేశాలపై ఇవి ప్రతీకార దాడులని అన్నారు. ప్రపంచం ప్రశాంతంగా వున్న సమయంలో ఆయిల్‌కోసం , ఆయా దేశాల నాయకత్వాలను గుప్పెట్లో పెట్టుకోవడంకోసం ఎవరు ముందు దాడిచేశారు? ఎవరు నరమేధం జరిపారు? వేలాదిమంది అమాయకులపై ఎవరు ముందు ఉగ్రదాడులు జరిపారు? ఆలోచించుకోవాలని ఆయన కోరారు. ఇరాక్‌పై ఎందుకు దాడిచేసి లక్షలాదిమంది అమాయక పౌరులపై బాంబులేసి చంపి, ఐఎస్ ఐఎస్ ఏర్పడడానికి ఎవరు కారకులు అయ్యారో ఆలోచించుకోవాలని అన్నారు. పారిస్‌పై దాడి ప్రతిచర్య అయితే చర్య ఎవరిదో గమనించాలన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో ప్రపంచయుద్ధం తప్పదన్నారు. పారిస్ పై దాడిని అరబ్ దేశాల్లో అమాయక ముస్లింల చావులకు ప్రతీకారంగా ఆయన అభివర్ణించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆజంఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతుంది.
ఇస్లాంకు సంబంధం లేదు: అసద్
ఇదే సమయంలో దేశంలో ఏకైక ముస్లిం పార్టీ అయిన మజ్లిస్ (ఏఐఎమ్ ఐ ఎమ్) అధినేత విభిన్నంగా స్పందించారు. ఐఎస్‌కు ముస్లింలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అరబ్ దేశాల నుంచి లక్షలాది మందిని తరిమేస్తున్న అలాంటి సంస్థతో ముస్లింలకు సంబంధం కలపడాన్ని ఆయన తప్పుబట్టారు. మతం పేరుతో లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఐఎస్ తీరును ఎవరూ స్వాగతించరన్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
Next Story