Telugu Global
Others

అనురాధ హ‌త్య జ‌రిగిన తీరు ఇది

చిత్తూరు మేయ‌ర్ అనురాధ దంప‌తుల‌పై దాడి సినీ ప‌క్కీలో జ‌రిగింది. మేడ‌మ్‌ను అభినందించాలంటూ  ఆరుగురు వ్య‌క్తులు బుర‌ఖాలు ధ‌రించి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో మేయ‌ర్‌ను క‌ల‌వ‌డానికి దాదాపు 50 మంది వ‌ర‌కు ఉన్నారు. బుర‌ఖాల్లో ఉండ‌డంతో మ‌హిళ‌ల‌న్న ఉద్దేశంతో వారిని ఎవ‌రూ ఆప‌లేదు. అనుమానించ‌లేదు.  అలా నేరుగా లోనికి వెళ్లిన ఆరుగురు ఒక్క‌సారిగా బుర‌ఖాలు తీసి  తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో మేయ‌ర్‌పై కాల్పులు జ‌రిపారు. దీంతో ఆమె అక్క‌డిక్క‌డే కుప్పకూలి చ‌నిపోయారు. ఆమెకు నుదుటి మీద, కంటి కింద బుల్లెట్లు తగిలాయి. అదే స‌మ‌యంలో మేయ‌ర్ చాంబ‌ర్‌లోనే […]

అనురాధ హ‌త్య జ‌రిగిన తీరు ఇది
X

చిత్తూరు మేయ‌ర్ అనురాధ దంప‌తుల‌పై దాడి సినీ ప‌క్కీలో జ‌రిగింది. మేడ‌మ్‌ను అభినందించాలంటూ ఆరుగురు వ్య‌క్తులు బుర‌ఖాలు ధ‌రించి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో మేయ‌ర్‌ను క‌ల‌వ‌డానికి దాదాపు 50 మంది వ‌ర‌కు ఉన్నారు. బుర‌ఖాల్లో ఉండ‌డంతో మ‌హిళ‌ల‌న్న ఉద్దేశంతో వారిని ఎవ‌రూ ఆప‌లేదు. అనుమానించ‌లేదు. అలా నేరుగా లోనికి వెళ్లిన ఆరుగురు ఒక్క‌సారిగా బుర‌ఖాలు తీసి తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో మేయ‌ర్‌పై కాల్పులు జ‌రిపారు. దీంతో ఆమె అక్క‌డిక్క‌డే కుప్పకూలి చ‌నిపోయారు. ఆమెకు నుదుటి మీద, కంటి కింద బుల్లెట్లు తగిలాయి.

అదే స‌మ‌యంలో మేయ‌ర్ చాంబ‌ర్‌లోనే ఉన్న ఆమె భ‌ర్త మోహ‌న్‌పై క‌త్తుల‌తో దాడికి దిగారు. మోహన్‌పై పొడవాటి కత్తులతో విరుచుకుపడ్డారు. ఆయన మెడ వెనకభాగంలో నరకడంతో నరాలు తెగిపోయాయి. దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో ఎనిమిది కార్పొరేట‌ర్లు అక్క‌డే ఉన్నారు. కానీ వారంతా భ‌యంతో ప‌రుగులు తీశారు. ఇటీవ‌ల ఒక కేసులో రాజీప‌డ‌డంతో భ‌ద్ర‌తా విష‌యంలో అనురాధ దంప‌తులు కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇదే దుండుగుల ప‌నిని ఈజీ చేసింది. గతంలో కూడా మోహన్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పట్లో ఆ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. దాడితో ఛాంబర్‌లో ఉన్న అద్దాలు మొత్తం పగిలిపోయాయి. మేయర్‌కు భద్రత కోసం కేవలం వ్యక్తిగత అనుచరులు ఉన్నారే తప్ప పోలీసులు మాత్రం ఎవరూ లేరు. మెరుపుదాడిని అనుచ‌రులు కూడా అడ్డుకోలేక‌పోయారు.

15 రోజుల ముందు నుంచే రెక్కీ
అనురాధ దంప‌తుల హ‌త్య‌కు నెల రోజుల ముందు నుంచే దుండ‌గులు రెక్కీ నిర్వ‌హించ‌న‌ట్టు తెలుస్తోంది. అనురాధ ఎప్పుడు కార్యాల‌యానికి వ‌స్తారు, ఆమె వెంట‌ ఎంత‌మంది ఉంటారు. సెక్యూరిటీ స్థితిగ‌తులేంటి ఇలా అన్నింటిని ప‌రిశీలించిన‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవ‌ల ఓకేసులో రాజీ ప‌డ‌డంతో భ‌ద్ర‌త విష‌యంలో అనురాధ దంప‌తులు నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని కూడా రెక్కీలో గ‌మ‌నించారు.దాడి జ‌రిగిన స‌మ‌యంలో మేయ‌ర్‌కు ఎలాంటి భ‌ద్ర‌తా కూడా లేదు. ఇదే హంతుకుల ప‌నిని మ‌రింత ఈజీ చేసింది. నేరుగా చాంబ‌ర్‌లోకి వెళ్లి అటాక్ చేయ‌డానికి కార‌ణ‌మైంది. అనూరాధ ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 10.30 గంటలమ‌ధ్య‌లో కార్పొరేషన్ కార్యాలయానికి వస్తున్న విషయాన్ని గ‌మనించి… జనంతో కలిసిపోయి అక్క‌డికి వచ్చారు. క్ష‌ణాల్లో ప‌ని పూర్తి చేసుకుని గోడ‌లు దూకిపారిపోయారు. అంద‌రి ముందే దుండుగులు పారిపోతున్నా వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌లేదు. దుండ‌గుల చేతిలో తుపాకులుండ‌డంతో త‌న ప్రాణాలు కాపాడుకునేందుకే అక్క‌డున్న జ‌నం, కార్పొరేట‌ర్లు ప‌రుగులు తీశారు.

Also Rad: చిత్తూరు మేయర్ అనురాధ దారుణహత్య

First Published:  17 Nov 2015 10:29 AM IST
Next Story