Telugu Global
Cinema & Entertainment

రావణాసురుడి బ్యాచ్‌లో చేరిన వర్మ

పది మంది పాడే పాటనే తాను పాడితే ప్రత్యేకత ఏముంటుందన్నట్లుగా వ్యవహరించే వర్మ ఈసారి రాముడు,రావణాసురుడి మీద పడ్డారు. దేశమంత రావణుడు విలన్ అంటుంటే వర్మ మాత్రం అదేలా అని ప్రశ్నిస్తున్నారు. రావణుడు సీతను కిడ్నాప్ చేశాడే గానీ ఏమీ చేయలేదు కదాని లాజిక్కులు కూడా అడుగుతున్నారు. సీత తన ఆధీనంలో నెలల తరబడి ఉన్నా రావణుడు ఏనాడు హద్దు దాటలేదని చెబుతున్నారు వర్మ. సీత పట్ల రావణుడు ఏనాడు ఒక విలన్‌లాగా ప్రవర్తించలేదని చూసొచ్చిన్నట్టుగా వర్మ […]

రావణాసురుడి బ్యాచ్‌లో చేరిన వర్మ
X

పది మంది పాడే పాటనే తాను పాడితే ప్రత్యేకత ఏముంటుందన్నట్లుగా వ్యవహరించే వర్మ ఈసారి రాముడు,రావణాసురుడి మీద పడ్డారు. దేశమంత రావణుడు విలన్ అంటుంటే వర్మ మాత్రం అదేలా అని ప్రశ్నిస్తున్నారు. రావణుడు సీతను కిడ్నాప్ చేశాడే గానీ ఏమీ చేయలేదు కదాని లాజిక్కులు కూడా అడుగుతున్నారు. సీత తన ఆధీనంలో నెలల తరబడి ఉన్నా రావణుడు ఏనాడు హద్దు దాటలేదని చెబుతున్నారు వర్మ.

సీత పట్ల రావణుడు ఏనాడు ఒక విలన్‌లాగా ప్రవర్తించలేదని చూసొచ్చిన్నట్టుగా వర్మ ట్వీట్ చేశారు. అసలు తాను చదివిన పురాణాల్లో ఎక్కడా కూడా రాక్షసులు రాక్షసత్వంతో ప్రవర్తించలేదని రాక్షసజాతికి సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. రచయితలే రాక్షసుల వ్యక్తిత్వాన్ని సరిగా చూపలేదని విమర్శ కూడా పడేశారు వర్మ. సీతను అపహరించడం వల్లే రావణాసుడు విలన్ అయితే అలాంటి వారిని దేశంలో ప్రతినెల 100 మందిని చూడొచ్చని ట్వీట్ చేశారు.

First Published:  16 Nov 2015 2:27 PM IST
Next Story