Telugu Global
NEWS

వర్షం ఎఫెక్ట్- పలు రైళ్లు రద్దు

తమిళనాడు,దక్షిణ కోస్తాలో కురుస్తున్న భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తమిళనాడు, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై- విజయవాడ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.  చెన్నై-విజయవాడ మధ్య నడిచే మిగిలిన రైళ్లను కూడా దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. చాలా చోట్ల ట్రాక్‌లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అటు భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు […]

వర్షం ఎఫెక్ట్- పలు రైళ్లు రద్దు
X

తమిళనాడు,దక్షిణ కోస్తాలో కురుస్తున్న భారీ వర్షాలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తమిళనాడు, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై- విజయవాడ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. చెన్నై-విజయవాడ మధ్య నడిచే మిగిలిన రైళ్లను కూడా దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. చాలా చోట్ల ట్రాక్‌లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అటు భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు . .

First Published:  16 Nov 2015 1:34 AM GMT
Next Story