Telugu Global
NEWS

నేడు డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ

దేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. 580 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఉచితంగా ఇంత వ‌ర‌కు ఏ ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదు. అసాధ్యమన్నదాన్ని తెలంగాణ ప్రభుత్వం సుసాధ్యం చేసింది. సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. 396మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తారు. సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో జి ప్లస్ 2 మోడల్ లో 396ఇళ్లను […]

నేడు డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ
X

దేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. 580 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఉచితంగా ఇంత వ‌ర‌కు ఏ ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదు. అసాధ్యమన్నదాన్ని తెలంగాణ ప్రభుత్వం సుసాధ్యం చేసింది. సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. 396మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తారు.

సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో జి ప్లస్ 2 మోడల్ లో 396ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. 33 బ్లాకుల్లో నిర్మించిన ఈ ఇళ్లకు మొత్తం 43కోట్లు ఖర్చు చేసింది. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా అత్యంత ఆధునిక హంగులతో ఐడీహెచ్‌ కాలనీ ఇళ్లను నిర్మించారు. నిర్మాణ ఖర్చునంతా ప్రభుత్వమే భరించింది. ప్రభుత్వం నిర్మించిన ఇంట్లో రెండు బెడ్‌రూంలు, రెండు బాత్‌రూంలు, విశాల‌మైన హాల్‌, వంట గ‌ది ఉన్నాయి. ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన 396 ఇళ్లలో 276 షెడ్యూల్డు కులాల లబ్ధిదారులకు కేటాయించారు. 31 ఇళ్లను ఎస్టీలకు ఇస్తున్నారు. 79 ఇళ్లను బలహీన వర్గాలకు కేటాయించారు. మిగిలిన ఇళ్లను మైనారిటీలు, ఇతరులకు ఇస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

2014 అక్టోబర్ లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వం 6 నెలల్లో ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పింది. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యమై 13 నెలల్లో నిర్మాణం పూర్తి చేశారు. దీనిపై లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అనుభవంతో హైదరాబాద్ లో 9 అంతస్తుల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

First Published:  16 Nov 2015 1:26 AM IST
Next Story