Telugu Global
Others

ప్రత్యేకహోదాకు ఎవరు ఆటంకం..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకునే క్రమంలో అధికారతెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనం వహిస్తోంది? ఆదిశగా పోరాటం చేసే పార్టీలు,నేతలపై ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది? రాష్ట్ర విభజన చేసి,కట్టుబట్టలతో నడిరోడ్డుపైన పడేశారనే ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా విషయంలో పోరాడే పక్షాలతోకలిసి ఎందుకు ముందుకు వెళ్లలేకపోతున్నారు? రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పనిచేసేముఖ్యమంత్రి,విజన్‌ 2050 అంచనాలతో ముందుకు వెళ్లే చంద్రబాబు కేంద్రంపై ఎందుకు వత్తిడి తేలేకపోతున్నారు? వీటన్నింటికీ రాజకీయపరమైన ప్రయోజనాలేతప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కావనిఅర్థంఅవుతోంది. ప్రత్యేకహోదాపై తెలుగుదేశం,బిజెపి పార్టీలు మినహా అన్ని పార్టీలు, […]

ప్రత్యేకహోదాకు ఎవరు ఆటంకం..?
X

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకునే క్రమంలో అధికారతెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనం వహిస్తోంది? ఆదిశగా పోరాటం చేసే పార్టీలు,నేతలపై ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది? రాష్ట్ర విభజన చేసి,కట్టుబట్టలతో నడిరోడ్డుపైన పడేశారనే ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా విషయంలో పోరాడే పక్షాలతోకలిసి ఎందుకు ముందుకు వెళ్లలేకపోతున్నారు? రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పనిచేసేముఖ్యమంత్రి,విజన్‌ 2050 అంచనాలతో ముందుకు వెళ్లే చంద్రబాబు కేంద్రంపై ఎందుకు వత్తిడి తేలేకపోతున్నారు? వీటన్నింటికీ రాజకీయపరమైన ప్రయోజనాలేతప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం కావనిఅర్థంఅవుతోంది. ప్రత్యేకహోదాపై తెలుగుదేశం,బిజెపి పార్టీలు మినహా అన్ని పార్టీలు, పక్షాలు పోరాడుతున్నాయి. నినదిస్తున్నాయి. చంద్రబాబునాయుడికి రాష్ట్రాభివృద్దే ఏకైక లక్ష్యం అయితే విపక్షాలనుకూడా కలుపుకొని కేంద్రంపై పోరాటం చేయాలి కదా? ప్రత్యక్షంగా పోరాటానికి దిగే సాహసంచేయలేకపోయినా, పోరాడే శక్తులను అయినా ప్రోత్సహించి,న్యాయబద్దమైన డిమాండ్‌ను సాధించుకోవచ్చు కధా? అయినా ముఖ్యమంత్రి ఇవేమీ చేయడం లేదు. కారణం ఏమిటి?

ప్రత్యేకహోదా ఎందుకు?

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎందుకు అవసరం? ప్రత్యేకహోదా రాకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదా? అంటే కాదనేచెప్పాలి. అనుకోని రీతిలో రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా, రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే రాష్ట్ర విభజన జరిగింది. దిక్కులేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రత్యేకహోదా,ప్యాకేజీలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను బిజెపి ప్రభుత్వం మర్చిపోయింది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తేవడానికి వెనుకడుగు వేస్తోంది.

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా,ఉపాధి అవకాశాలు కావాలన్నా, వెనుకబడిన ఉత్తరాంధ్ర,రాయలసీమ జిల్లాలు అభివృద్ది చెందాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు అవసరం. రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాపైనే ఆధారపడి ఉంది. ఈవిషయాన్ని తెలుగుదేశం,బిజెపిలు మినహా అందరూ గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్తీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడానికి పూనుకొంది.రాష్ట్రానికి ప్రత్యేకహోదా,వెనుకబడిన రాయలసీమ,ఉత్తరాంధ్రజిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ,పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏడాదికి 4వేల కోట్ల రూపాయల నిధుల కేటాయింపు,రాజధాని నిర్మాణానికి,రాష్ట్ర ప్రణాళిక లోటు భర్తీకి తగిన నిధులు అందించడం వంటి హామీలను కూడా కేంద్రం మర్చిపోయింది.ఏరాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రణాళికాశాఖా మంత్రి ఇంద్రజిత్‌సింగ్‌ గతంలోనే ప్రకటించారు.పన్నురాయితీలతో పాటు ఐదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ పార్లమెంటులో ప్రకటించారు. అపుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు ఐదు ఏళ్లు కాదు 10 ఏళ్లపాటు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్‌ చేశారు.తాము అధికారంలోకి వచ్చాక పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని కూడా పార్లమెంటులో ప్రకటించారు.చంద్రబాబు అయితే ఏకంగా పదేళ్లు కాదు 15 ఏళ్లపాటు ప్రత్యేకహోదా కావాలని ఎన్నికల్లో ప్రతిపక్షం హోదాలో డిమాండ్‌ చేశారు. అధికారంలోకి అటు బిజెపి,ఇటు తెలుగుదేశం పార్టీలు వచ్చాయి. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చే క్రమంలో ఎవరూ అడుగు ముందుకు వేయడం లేదు.వెనుకబడిన ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేకప్యాకేజీ ఇస్తామన్న హామీని కూడా పూర్తిగా నెరవేర్చేలా లేదు. పునర్విభజన చట్టంలోని 46(2),(3) ప్రకారం రాష్ట్రంలో సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.350 కోట్లను కేంద్రం ప్రకటించింది. జిల్లాకు 50 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయి. రాయలసీమలో నాలుగు జిల్లాలు తీవ్ర దుర్భిక్షంతో అల్లాడిపోతున్నాయి. వీటిలో అనంతపురం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా జిల్లాల ఆర్థికాభివృద్దికి రూ.24,350కోట్లు ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని,14వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ కేంద్రం స్పందించిన తీరు బాధాకరమే. కేవలం రూ.500 కోట్లను మాత్రమే ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుంది.విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కలిగిన రూ.15,400 కోట్ల లోటు బడ్జెట్‌ను పూడ్చేందుకు అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చారు. ఇలాంటి తిలోదకాలే అనేకం ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పేర్కొన్న అంశాలు గానీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గానీ అటు బిజెపి,ఇటు టిడిపి లు పూర్తిస్థాయిలో మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నాయి. వాటిని గుర్తుచేసి, అమలు చేయమని పోరాడే వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి.కేసులు పెట్టి వేధిస్తున్నాయి.

బాబు వెనకడుగెందుకు?
కేంద్రంపై పోరాడం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నారు. దీనికి అనేక అంశాలు ఆటంకంగా నిలుస్తున్నాయి. ఓటుకునోటు కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీనికి తోడు వైసిపి అధినేత జగన్‌ పొంచి ఉన్నారు. మరో వైపు అమరావతి రాజధానినిర్మాణంలో అనేక అంశాలు కేంద్రం క్లియర్‌ చేయాల్సి ఉంది. దేశ,విదేశీ సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే కేవలం రాష్ట్రం మాత్రమే హామీ ఇస్తే సరిపోదు.కేంద్రం నుంచి ఆయా సంస్థలు హామీలు కోరుతున్నాయి. సింగపూర్‌,జపాన్‌ కంపెనీలు అయితే ఈవిషయంలో మరింత పట్టుదలతో ఉన్నాయి. ”మూడేళ్ల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మా పెట్టుబడులకు,మా సంస్థల విస్తరణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూస్తే మేము ఆంధ్రాలో పెట్టుబడులు పెడతాం. చట్టబద్దమైన హామీ మాకు ఉండేలా చూడండి.” అని సింగపూర్‌,జపాన్‌ కంపెనీలు ఈపాటికే కోరాయి. దీనిపై కేంద్రంతో చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా, మున్సిపల్‌ శాఖ నుంచి అనుమతి ఇచ్చేలా మాత్రమే ఆమోదించింది.కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి, చట్టబద్దమైన హామీ ఉంటేనేతాము ముందుకు వస్తామని విదేశీ కంపెనీలు స్పష్టం చేశాయి. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ఇపుడున్న పరిస్థితుల్లో కేంద్రాన్ని పన్నెత్తు మాట అనలేని పరిస్థితి. అందుకే ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కుగా ఉన్నా దాన్ని సైతం చంద్రబాబు ఫణంగా పెట్టేందుకు పూనుకున్నారు. కేంద్రం మాత్రం ఏవిషయంలోనూ చంద్రబాబుకు అండగా నిలిచేలా లేదనడానికి ఇవే నిదర్శనాలు.

ఇలాంటి పరిస్థితుల్లోచంద్రబాబు అన్ని పక్షాలతో కలిసి పోరాడితేనే ప్రత్యేకహోదా వస్తుందని గమనించాలి. పోరాడితే పోయేదేమీ లేదు…మహా అయితే ప్రత్యేకహోదా,ప్యాకేజీ వస్తుందని గమనించాలి. ఈవిషయాన్ని బాబు ఎంత తొందరగా గమనిస్తే అంత బాగుంటుంది.

First Published:  15 Nov 2015 1:49 AM GMT
Next Story