అమరావతిలో బాలయ్య పాటల సందడి
అటు పాలిటిక్స్, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. ఈసారి ఆ బ్యాలెన్స్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలనుకుంటున్నాడు. అందుకే తన కొత్త సినిమా ఆడియో ఫంక్షన్ ను ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో ప్లాన్ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిక్టేటర్ పాటలు అమరావతిలో లాంఛ్ అవుతాయి. డేట్ కూడా ఫిక్స్ అయింది. డిసెంబర్ 20న అమరావతిలో డిక్టేటర్ పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమాను […]
BY sarvi15 Nov 2015 12:38 AM IST

X
sarvi Updated On: 16 Nov 2015 4:11 AM IST
అటు పాలిటిక్స్, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలయ్య. ఈసారి ఆ బ్యాలెన్స్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలనుకుంటున్నాడు. అందుకే తన కొత్త సినిమా ఆడియో ఫంక్షన్ ను ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో ప్లాన్ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిక్టేటర్ పాటలు అమరావతిలో లాంఛ్ అవుతాయి. డేట్ కూడా ఫిక్స్ అయింది. డిసెంబర్ 20న అమరావతిలో డిక్టేటర్ పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తారు. అమరావతి అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి మద్దతుగా బాలయ్య కూడా రాజధాని అభివృద్ధి కోసం సిద్ధమయ్యారు. సినీపరిశ్రమ అమరావతికి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పరిశ్రమకు చంద్రబాబు పూర్తి సహాయసహకారాలు అందిస్తారని కూడా చెబుతున్నారు. ఇందులో భాగంగా తనవంతుగా డిక్టేటర్ ఆడియో ఫంక్షన్ తో తొలి అడుగు వేయడానికి సిద్ధమౌతున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మరి నటసింహం చూపిస్తున్న ఈ చొరవ, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Next Story