Telugu Global
Others

త్వరలో ఇంగ్లండ్ కు భారతీయుడే ప్రధాని

ఒకప్పుడు ప్రపంచ దేశాలను ఏలిన ఇంగ్లండ్ కు త్వరలోనే భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఆదేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ జోస్యం చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి వెంబ్లీ స్టేడియంకు వచ్చిన కామెరాన్.. మొదట అక్కడున్న ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్, బ్రిటన్ మధ్య ఉన్న స్నేహసంబంధాలను ఆయన గుర్తు చేశారు. నమస్తే వెంబ్లీ అంటూ స్పీచ్ ను మొదలు పెట్టిన కామెరాన్.. ‘కేమ్ చో’ అంటూ గుజరాతీ భాషలో అందర్నీ పలుకరించారు.  […]

త్వరలో ఇంగ్లండ్ కు భారతీయుడే ప్రధాని
X
ఒకప్పుడు ప్రపంచ దేశాలను ఏలిన ఇంగ్లండ్ కు త్వరలోనే భారత సంతతి వ్యక్తి ప్రధాని అవుతారని ఆదేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ జోస్యం చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి వెంబ్లీ స్టేడియంకు వచ్చిన కామెరాన్.. మొదట అక్కడున్న ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్, బ్రిటన్ మధ్య ఉన్న స్నేహసంబంధాలను ఆయన గుర్తు చేశారు. నమస్తే వెంబ్లీ అంటూ స్పీచ్ ను మొదలు పెట్టిన కామెరాన్.. ‘కేమ్ చో’ అంటూ గుజరాతీ భాషలో అందర్నీ పలుకరించారు.
భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కామెరాన్ మరోసారి ప్రకటించారు. టీమ్ ఇండియా – టీమ్ యూకే..కలిస్తే అది విన్నింగ్ టీమ్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడదాం.. మీరు ముంబైలో బాధపడ్డారు. మేం లండన్‌లో ఆ బాధను అనుభవించాం. ఉమ్మడిగా ఉగ్రవాదులను ఓడిస్తాం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఒక చాయ్‌వాలా పరిపాలించలేరని విమర్శకులు అన్నారు.. కానీ మోడీ ఆ అంచనాలు తప్పు అని నిరూపించారు. బ్రిటన్.. భారత్ కు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. భారత్ లో అచ్ఛే దిన్ ఆయేంగే! అచ్ఛే దిన్ జరూర్ ఆయేంగే! అనడంతో వెంబ్లే స్టేడియం అంతా హర్షధ్వానాలతో మార్మోగింది.
First Published:  14 Nov 2015 5:13 AM IST
Next Story