వర్మ ఆత్మగారి కథ.. వచ్చే నెలలో విడుదల
వివాదాల డైరెక్టర్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కేందుకు సిద్ధమయ్యారు. తన ఆత్మను తట్టిలేపి పాతగాథలతో ఆత్మకథ రాసేశాడు. వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ విషయాన్ని వివాదాలకు వేదికగా వాడుకునే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఆత్మకథకు ఓ పేరు కూడా పెట్టేశారు. గన్స్ అండ్ థైస్ దాని పేరు. ఆత్మకథ కవర్ పేజీని కూడా విడుదల చేశారు. మేధావులకు మేనమామలాగా కవర్ పేజ్‌లో పోజ్ ఇచ్చారు వర్మ. రూపా పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ […]
వివాదాల డైరెక్టర్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కేందుకు సిద్ధమయ్యారు. తన ఆత్మను తట్టిలేపి పాతగాథలతో ఆత్మకథ రాసేశాడు. వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ విషయాన్ని వివాదాలకు వేదికగా వాడుకునే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఆత్మకథకు ఓ పేరు కూడా పెట్టేశారు. గన్స్ అండ్ థైస్ దాని పేరు.
ఆత్మకథ కవర్ పేజీని కూడా విడుదల చేశారు. మేధావులకు మేనమామలాగా కవర్ పేజ్‌లో పోజ్ ఇచ్చారు వర్మ. రూపా పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది. ఆత్మకథలోని కొన్ని చాప్టర్లలో… తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, అండర్ వరల్డ్ తోనూ, మహిళలతోను ఉన్న సంబంధాల గురించి కూడా చెబుతానంటూ ఓ టీజర్ వదిలేశారు. అదన్న మాట.. వచ్చే నెలలో వర్మ ఆత్మకథకు తెలుగు మీడియా అంకితం అయ్యే అవకాశం ఉంది.