మొన్న కబ్జా.. నిన్న హత్యాయత్నం..!
గ్రేటర్ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌పై వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు వివాదాస్పద విషయాలతో వార్తల్లోకెక్కారు. వాటిలో ఒకటి భూ కబ్జా కాగా, రెండోది హత్యాయత్నం కావడం గమనార్హం. గతవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్‌లో రోడ్డును ఆక్రమించి ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఓ భారీ వాణిజ్య సముదాయాన్ని తన తల్లిపేరిట నిర్మిస్తున్నారని హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధి అయి ఉండి యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడంపై మండిపడింది. […]
BY admin13 Nov 2015 4:33 AM IST
X
admin Updated On: 13 Nov 2015 4:33 AM IST
గ్రేటర్ హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌పై వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు వివాదాస్పద విషయాలతో వార్తల్లోకెక్కారు. వాటిలో ఒకటి భూ కబ్జా కాగా, రెండోది హత్యాయత్నం కావడం గమనార్హం. గతవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్‌లో రోడ్డును ఆక్రమించి ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఓ భారీ వాణిజ్య సముదాయాన్ని తన తల్లిపేరిట నిర్మిస్తున్నారని హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధి అయి ఉండి యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడంపై మండిపడింది. ఈ విషయంలో మౌలిక వసతుల కల్పన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజాగా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ టపాసుల దుకాణం విషయంలో ఎమ్మెల్యే అనుచరుడిని ఓ దుకాణాదారుడు ప్రశ్నించాడు. సదరు వ్యక్తిపై నేరుగా ఎమ్మెల్యేనే చేయిచేసుకోవడం సంచలనం సృష్టించింది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఓ దుకాణాదారుడిపై చేయి చేసుకోవడంతో కలకలం రేగింది. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారం వ్యవధిలో రెండు కేసుల్లో ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడం గమనార్హం.
Next Story