సారికను సన కూడా వేధించింది
వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. సారిక భర్త అనిల్ రెండో భార్య సనను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి మరిన్ని నిజాలు రాబడుతున్నారు. సనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు పొందుపరిచారు. సారికను రాజయ్య కుటుంబంతో పాటు సన కూడా వేధించిందని అందులో స్పష్టం చేశారు. పలుమార్లు ఫోన్ చేసి బెదిరించినట్టు గుర్తించారు. మూడు సార్లు నేరుగా ఇంటికి […]
వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. సారిక భర్త అనిల్ రెండో భార్య సనను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి మరిన్ని నిజాలు రాబడుతున్నారు. సనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు పొందుపరిచారు. సారికను రాజయ్య కుటుంబంతో పాటు సన కూడా వేధించిందని అందులో స్పష్టం చేశారు.
పలుమార్లు ఫోన్ చేసి బెదిరించినట్టు గుర్తించారు. మూడు సార్లు నేరుగా ఇంటికి వెళ్లి సారికను సన బెదిరించింది. రాజయ్యకు ఎంపీ టికెట్ రాగానే సారికను ఇంటి నుంచి గెంటివేయాలని భర్తపై సన ఒత్తిడి తెచ్చినట్టు రిమాండ్ రిపోర్టులో ఉంది. సారికది ఆత్మహత్య అయినప్పటికీ వీరందరి వేధింపుల కారణంగానే ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసులు తేల్చారు. మొత్తం 26 కీలక అంశాలను రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
సనను అనిల్ 2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. సనతో పాటు పిల్లలను చూసేందుకు రాజయ్య దంపతులు తరచు వెళ్లేవారని పోలీసులు గుర్తించారు. సనతో వివాహం తర్వాతే సారికను నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం సనను వరంగల్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈనెల(నవంబర్) 27 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. రాజయ్య, అతడి భార్య, కొడుకు అనిల్ కూడా వరంగల్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు.