వైసీపీ వైపు శైలజనాథ్
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏపీ ప్రజల ఇచ్చిన ట్రిట్‌మెంట్‌ను తలచుకుని కాంగ్రెస్ నేతలు పదేపదే ఉలిక్కిపడుతున్నారు. కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని బడా నేతలు చెబుతున్నా రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్న వారెవరూ ఆ మాటలను నమ్మడం లేదు. అందుకే ఏదో ఒక దారి దొరక్కపోతుందా కాంగ్రెస్ గూటీ నుంచి ఎగిరిపోకపోతామా అని నేతలు ఎదురుచూస్తున్నారు. మాజీ మంత్రి శైలజనాథ్ కూడా అదో ఆలోచనలో ఉన్నారని సమాచారం. వైసీపి వైపు ఆయన చూస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాన్ […]
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏపీ ప్రజల ఇచ్చిన ట్రిట్‌మెంట్‌ను తలచుకుని కాంగ్రెస్ నేతలు పదేపదే ఉలిక్కిపడుతున్నారు. కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని బడా నేతలు చెబుతున్నా రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్న వారెవరూ ఆ మాటలను నమ్మడం లేదు. అందుకే ఏదో ఒక దారి దొరక్కపోతుందా కాంగ్రెస్ గూటీ నుంచి ఎగిరిపోకపోతామా అని నేతలు ఎదురుచూస్తున్నారు. మాజీ మంత్రి శైలజనాథ్ కూడా అదో ఆలోచనలో ఉన్నారని సమాచారం. వైసీపి వైపు ఆయన చూస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాన్ పార్టీ వైపు నుంచి కూడా చల్లని గాలులే వీస్తున్నాయట.
నిజానికి మొన్నటి ఎన్నికల సమయంలోనే శైలజనాథ్ కాంగ్రెస్‌ను వీడేందుకు ప్రయత్నించారు. వైసీపీ , టీడీపీ వైపు ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. టీడీపీ బీఫాం చేతికి వచ్చినా ఆఖరి నిమిషంలో ఎమ్మెల్సీ శమంతకమణి అడ్డుపడడంతో కాంగ్రెస్ నుంచే శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శైలజనాథ్ పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఎస్సీ రిజర్వ్ అయిన శింగనమల నుంచి వైసీపి అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేశారు. ఈమె భర్త అలూరు సాంబశివారెడ్డి(వీరిది ప్రేమ వివాహం). కానీ పద్మావతి, శైలజనాథ్‌లపై శమంతకమణి కూతురు యామిని బాల విజయం సాధించారు. అప్పటి నుంచి శైలజనాథ్ పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే ఇటీవల వైసీపీ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
జగన్ కూడా శైలజనాథ్ పట్ల సానుకూలంగానే ఉన్నారని చెబుతున్నారు. శమంతకమణి లాంటి నాయకురాలితో పోటీకి శైలజనాథే సరైన వ్యక్తిగా జగన్ భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత అలూరు సాంబశివారెడ్డి, అతడి భార్య పద్మావతి కూడా శింగనమల నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాయకులతో మంచి పరిచయాలుండడం, ఆర్థికంగానూ బాగానే ఉండడంతో శైలజనాథ్ వస్తే పార్టీకి కూడా మంచే జరుగుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న సాంబశివారెడ్డికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏదో విధంగా సాయం చేయవచ్చని సూచిస్తున్నారు. చూడాలి శైలజనాథ్ చేరిక ఇప్పుడే జరుగుతుందో లేక ఎన్నికల నాటికి చేరుతారో?