కుమారి కాపీ కాదు... సుకుమార్ జీవితం
కొంతకాలంగా తెలుగు సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన వెంటనే.. ఇది పలానా భాషలో సినిమాకు కాపీ అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా నెట్‌వర్కులు వచ్చాక తెలుగు దర్శకులకు ఈ చిక్కులు మరింతగా పెరిగాయి. రాజమౌళి, త్రివిక్రమ్, పూరీలు ఇప్పటికే కథలు కాపీ చేస్తారని ప్రచారం జరిగిపోయింది. తాజాగా విడుదలైన అఖిల్ సినిమాతో ఈ జాబితాలో దర్శకుడు వివి వినాయక్ కూడా చేరిపోయారు. ఈ ప్రభావం త్వరలో విడుదల కానున్న తెలుగుచిత్రం కుమారి 21ఎఫ్ మీద కూడా పడింది. తమ […]
BY sarvi13 Nov 2015 12:37 AM IST
X
sarvi Updated On: 13 Nov 2015 10:28 AM IST
కొంతకాలంగా తెలుగు సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైన వెంటనే.. ఇది పలానా భాషలో సినిమాకు కాపీ అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా నెట్‌వర్కులు వచ్చాక తెలుగు దర్శకులకు ఈ చిక్కులు మరింతగా పెరిగాయి. రాజమౌళి, త్రివిక్రమ్, పూరీలు ఇప్పటికే కథలు కాపీ చేస్తారని ప్రచారం జరిగిపోయింది. తాజాగా విడుదలైన అఖిల్ సినిమాతో ఈ జాబితాలో దర్శకుడు వివి వినాయక్ కూడా చేరిపోయారు. ఈ ప్రభావం త్వరలో విడుదల కానున్న తెలుగుచిత్రం కుమారి 21ఎఫ్ మీద కూడా పడింది.
తమ సినిమాను ఏ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టలేదని, కనీసం స్ఫూర్తిగా కూడా తీసుకోలేదని చెబుతున్నాడు ఈ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్. గతంలో కరెంట్ సినిమాకు దర్శకత్వం వహించి పరాజయాన్ని చవిచూసిన ఈ దర్శకుడు కుమారి 21ఎఫ్‌తో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. కుమారి 21ఎఫ్ చిత్రంపై జరుగుతున్న ప్రచారాన్ని సూర్యప్రతాప్ ఖండించాడు. ఈ సినిమాకు కథ అందించింది తన గురువు, దర్శకుడు సుకుమార్ అని, ఆయన జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నారని వెల్లడించాడు. ఆ కథకు తనకు దర్శకత్వం వహించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
Next Story