జేడీ కొట్టించుకోడానికి సిద్ధంగా లేడు
రజనీకాంత్ కొత్త సినిమా కబలి. ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా ప్రకాష్ రాజ్ ను మొదట తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఆ స్థానంలోకి జేడీ చక్రవర్తిని తీసుకున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని జేడీ ఖండించారు. తను రజనీకాంత్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు జేడీ చక్రవర్తి. దీంతో కబలి సినిమాలో విలన్ కోసం వేట మళ్లీ మొదలైంది. నిజానికి […]
BY sarvi13 Nov 2015 12:35 AM IST
X
sarvi Updated On: 13 Nov 2015 7:03 AM IST
రజనీకాంత్ కొత్త సినిమా కబలి. ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా ప్రకాష్ రాజ్ ను మొదట తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఆ స్థానంలోకి జేడీ చక్రవర్తిని తీసుకున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని జేడీ ఖండించారు. తను రజనీకాంత్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు జేడీ చక్రవర్తి. దీంతో కబలి సినిమాలో విలన్ కోసం వేట మళ్లీ మొదలైంది. నిజానికి ఈ సినిమాలో విలన్లు చాలామంది. ఇప్పటికే హిందీ, మలయాళ భాషలకు చెందిన విలన్లను కొందరిని ఎంపిక చేశారు. వాళ్లతో మలేషియాలో షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నారు. కానీ కీలకమైన మరో విలన్ మాత్రం ఇంకా కావాలి. ఆ పాత్ర కోసమే సినిమా యూనిట్ వెదుకుతోంది. తాజాగా జేడీ కూడా తిరస్కరించడంతో, విలన్ వేట మళ్లీ మొదలైంది. కబలి సినిమాను తెలుగులో మహదేవగా తీసుకొస్తున్నారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ లో మహదేవ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నెట్ లో లీకైన రజనీకాంత్ ఫొటోలు, మూవీపై అంచనాల్ని రెట్టింపు చేశాయి.
Next Story