Telugu Global
Cinema & Entertainment

స‌ల్మాన్ ఫ్యాన్స్ కు  డబుల్ ధమాకా

ఈ దీపావ‌ళి  కి స‌ల్మాన్ ఖాన్ అభిమానుల‌కు  డ‌బుల్ ధ‌మాక జ‌రిగింద‌నే చెప్పాలి. ఎందుకంటే  సల్మాన్ ద్విపాత్రాభినయం చేసిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రం  పండ‌క్కు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో  రాకుమారుడిగా గాంభీర్యం పలికిస్తూనే, సామాన్యుడైన ప్రేమ్ దిల్‌వాలేగా  సల్మాన్ ఇరవై ఏడేళ్ళ వెనక్కి వెళ్ళి, ‘మైనే ప్యార్ కియా’ నాటి అమాయకత్వాన్ని పలికించారు. ‘రాన్‌ఝానా’, ‘ఖూబ్‌సూరత్’ ఫేమ్ సోనమ్ కపూర్‌కు ఇది మరో మంచి పాత్ర. రకరకాల కోణాలున్న ఆ పాత్రను చేతనైనంత […]

స‌ల్మాన్ ఫ్యాన్స్ కు  డబుల్ ధమాకా
X

ఈ దీపావ‌ళి కి స‌ల్మాన్ ఖాన్ అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాక జ‌రిగింద‌నే చెప్పాలి. ఎందుకంటే సల్మాన్ ద్విపాత్రాభినయం చేసిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రం పండ‌క్కు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో రాకుమారుడిగా గాంభీర్యం పలికిస్తూనే, సామాన్యుడైన ప్రేమ్ దిల్‌వాలేగా సల్మాన్ ఇరవై ఏడేళ్ళ వెనక్కి వెళ్ళి, ‘మైనే ప్యార్ కియా’ నాటి అమాయకత్వాన్ని పలికించారు. ‘రాన్‌ఝానా’, ‘ఖూబ్‌సూరత్’ ఫేమ్ సోనమ్ కపూర్‌కు ఇది మరో మంచి పాత్ర. రకరకాల కోణాలున్న ఆ పాత్రను చేతనైనంత మెప్పించారు. దివాన్‌గా అనుపమ్ ఖేర్ చూపించే ప్రభుభక్తి, కర్తవ్యదీక్ష ఆ పాత్ర మీద ప్రేమను పెంచుతాయి. సవతి చెల్లెలు చంద్రికగా స్వరభాస్కర్‌ది మరో కీలక పాత్ర. కోపం, ద్వేషం నుంచి ప్రేమానుబంధం వైపు ఆ పాత్ర మారే తీరు బాగుంది. దాన్ని ఇంకొంత ఎఫెక్టివ్‌గా చెప్పేందుకు మరికొన్ని సీన్లు అవసరం. విలన్లుగా నీల్ నితిన్ ముఖేశ్, అర్మాన్ కోహ్లీ నిండుగా కనిపిస్తారు.
పెళ్ళిళ్ళు, ఉత్సవాలు, కుటుంబ బంధాలనే ‘రాజశ్రీ’ వారి చట్రంలోనే ఈ సినిమా తయారైంది. అయితేనేం, కెమేరా, ఆర్ట్ విభాగాల పనితనం మెచ్చుకోకుండా ఉండలేం. ‘రాజశ్రీ’ వారి మ్యూజికల్ డ్రామాలన్నిటి లానే ఈ సినిమాలో 40 నిమిషాలు పాటలే. కనీసం మూడు, నాలుగు పాటలు బాగున్నాయి. అయితే రాజ‌శ్రీ బ్యాన‌ర్ వాళ్లు త‌మ సాంప్ర‌దాయ ప‌ద్ద‌తినే క‌థ‌నంలో అన‌స‌రించ‌డంలో.. ఈ జ‌న‌రేష్ అభిమానుల‌కు సినిమా పెద్ద‌గా క‌నెక్ట్ అయ్యే చాన్సెస్ త‌క్కువ అని తేల్చారు స‌మీక్ష‌కులు. అది నిజ‌మే అనిపిస్తుంది ఈ సినిమా క‌లెక్ష‌న్ల‌ను చూస్తేంటే..!

First Published:  13 Nov 2015 12:38 AM IST
Next Story